మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 154వ చిత్రంగా బాబి దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. సినిమా టైటిల్ ని బట్టే మాస్ కంటెంట్ తో తెరకెక్కతోన్న చిత్రంగా తెలుస్తోంది. చిరంజీవి పాత్ర ఆద్యంతం ఊర మాస్ గా మలుస్తున్నారు. బాబి మాస్ అభిమానాన్ని మొత్తం రంగరించి చిరు పాత్రని డిజైన్ చేసారు.
తన అభిమానమంతా తెరపై కనిపించనుంది. వైజాగ్ వాల్తేర్ నేపథ్యంలో సాగే స్టోరీలో ఇంకా కొన్ని బలమైన పాత్రలు సైతం కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి సోదరుడి పాత్రలో మాస్ రాజా రవితేజ నటిస్తున్నారు. ఆ రెండు పాత్రలత మధ్య బలమైన ఎమోషన్ సన్నివేశాలుంటాయని తెలుస్తోంది. రవితేజ తెరపై కనిపించేది కాసేపే అయినా ఉన్నంతసేపు ఓ ఊపు ఊపేసి వెళ్లిపోయేలా పాత్ర ఉంటుందని టాక్.
ఇంకా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సహా నాగార్జున కూడా భాగమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తంగా భారీ మల్టీస్టారర్ గానే రూపొందుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు క్లైమాక్స్ కి చేరుకుంది.
రెండు నెలలు షూట్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేయాలన్నది మేకర్స్ ప్లాన్. ఎలాగూ సంక్రాంతి కూడా సమీపంలో ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేసారు.
కానీ ఇప్పుడా ప్లాన్ లో మార్పులొస్తున్నట్లు తాజా సమాచారం. వేసవి కానుకగా సినిమా విడుదల చేయాలని కొత్త ప్రపోజల్ తెరపైకి వస్తుంది. ఇప్పటికప్పడు అన్ని పనులు పూర్తిచేయడానికి హడావుడి పడటం కన్నా సమయం తీసుకుని కూల్ గా పూర్తిచేయడమే ఉత్తంగా భావించి బాబి వెనక్కి తగ్గుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
ఇదే నిజమైతే 'భోళా శంకర్' ప్లాన్ కూడా మారుతుంది. 'భోళా శంకర్' ని సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. దసరా..సంక్రాంతి..సమ్మర్ ఇలా మూడు సీజన్లని టార్గెట్ చేసి మెగాస్టార్ బరిలోకి దిగాలని భావించారు. దసరా ఫిక్స్ అయినా అటుపై రెండు సీజన్లో ఓ సీజన్ వదులుకోవాల్సి వస్తుందని తాజా పరిస్థితుల్ని బట్టి తెలుస్తోంది. ఇదే నిజమైతే 'భోళా శంకర్' రిలీజ్ కి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఇక చిరు నటించిన 'గాడ్ ఫాదర్' ఆక్టోబర్ 5న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.