మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత మళ్లీ సినిమా షూటింగ్లలో పాల్గొనడానికి చాలా సమయం తీసుకున్నాడు. చాలావరకు అతను విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోరుకున్న తర్వాత షూటింగ్స్ మొదలుపెట్టాలి అని అనుకున్నాడు. ఇక మొత్తానికి ఇటీవల తన 15వ సినిమాను రీస్టార్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్ ఎలాగైనా ఆ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని అనుకుంటున్నాడు.
సాయిధరమ్ తేజ్ నుంచి చివరగా వచ్చిన రిపబ్లిక్ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందించినప్పటికీ కూడా కమర్షియల్ గా మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఏమీ రాలేదు.
ఇక ఇప్పుడు సాయిధరమ్ తేజ్ 15వ సినిమా కొంత ఆసక్తికరంగా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఒక మిస్టరీ థ్రిల్లర్ గా తెరపైకి రానుంది. అందులోను ఆ కథను సుకుమార్ అందించడం మరొక ఆసక్తికరమైన అంశం.
ఇక ఈ ప్రాజెక్టు ఎంతవరకు వచ్చింది అనే వివరాల్లోకి వెళితే.. SDT 15 షూటింగ్ ని సెప్టెంబర్ 5 కేరళలో తిరిగి ప్రారంభించాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. 2022 నవంబర్ చివరి నాటికి మొత్తం షూటింగ్‌ను ముగించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ మెగా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కార్తిక్ దండు దర్శకుడు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా లైన్ గురించి ఆ మధ్య ఒక టాక్ అయితే వినిపించింది. సినిమా అసలు కథ చేతబడి అలాగే మంత్రాల చుట్టూ తిరుగుతుందట.
అంతేకాకుండా వరుసగా జరుగుతున్న మర్డర్ మిస్టరీలను హీరో ఏ విధంగా ఛేదించాడు అనేది కూడా ఈ సినిమాలో మరో హైలెట్ పాయింట్ అని తెలుస్తోంది. ఏదేమైనా కూడా సుకుమార్ నుంచి ఇలాంటి డిఫరెంట్ కథ వస్తుంది అంటే ప్రేక్షకులలో కొంత అంచనాలు పెరుగుతాయి. మరి ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.