రెండు సింగాల్ని మించి మూడో సింగం!

Update: 2022-12-02 09:34 GMT
బాలీవుడ్ లో 'సింగం' ప్రాంచైజీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన ప‌నిలేదు.  'సింగం'..'సింగం రిట‌ర్స్'  చిత్రాలు బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో మోతెక్కించాయి. ఐదారు వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను రెండు భాగాలు సునాయాసంగా రాబ‌ట్టాయి. అప్ప‌టి నుంచి అజ‌య్ దేవ‌గ‌ణ్‌-రోహిత్ శెట్టి కాంబినేష‌న్ అంటే అంచ‌నాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. ఈ కాంబో నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నొచ్చినా బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే అన్న తీరున ఫేమ‌స్ అయ్యారు.

ఈ నేప‌థ్యంలో ఈ జోడి మ‌రోసారి చేతులు క‌ల‌ప‌డానికి రెడీ అవుతోంది.  ఇద్ద‌రి కాంబినేష‌న్ లో సింగం-3 కి రంగం సిద్దం చేస్తున్నారు. 'సింగం ఎగైన్' అంటూ మ‌రోసారి ర‌చ్చ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ రెండు భాగాల్ని మించి ఉంటుంద‌ని స‌మాచారం. స్ర్కిప్ట్ ని ఆరంభం నుంచి ముగింపు వ‌ర‌కూ  ప్రేక్ష‌కుడ్ని ప‌రుగులు పెట్టించేలా క‌థ‌సిద్దం చేస్తున్నారుట‌.

క‌థ‌లో కొత్త‌ద‌నం చూపిస్తూనే యాక్ష‌న్ పీక్స్ లో ఉండేలా డిజైన్ చేస్తున్నారుట‌. కాప్ స్టోరీలోనే హాలీవుడ్ రేంజ్ లో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉండేలా చూస్తున్నారుట‌. బ‌డ్జెట్ కూడా రెండు భాగాల్ని మించి భారీగా ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ కాంబో సెట్స్ కి వెళ్ల‌డానికి కొంచెం స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌స్తుతం అజ‌య్ దేవ‌గ‌ణ్ చేతిలో చాలా సినిమాలున్నాయి.

ముందుగా వాన‌టి పూర్తిచేయాలి. అలాగే మ‌రికొన్నిసినిమాలకు అడ్వాన్స్  లు అందుకున్నారు. వాటికి డేట్లు కేటాయించ‌లేదు. వాటిని సైతం ఓ కొలిక్కి తీసుకురావాలి. అలాగే రోహిత్ శెట్టికూడా కొన్ని సినిమాల్లో  బిజీగా ఉన్నారు.

వాటిని ఆయ‌న పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఈ ద్వ‌యం  'సింగం ఎగైన్' పై పూర్తి స్థాయితో దృష్టిలో పెట్టే అవ‌కాశం ఉంది. అలాగే అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇత‌ర‌ భాషా చిత్రాల్లో  కూడా  న‌టిస్తున్నారు.  ఆ మ‌ధ్య రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం  'ఆర్ ఆర్ ఆర్' లో కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News