బుల్లితెర రియాలిటీ షో `బిగ్ బాస్` హంగామా అంతకంతకు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. టీఆర్పీ గేమ్ లో అటూ ఇటూ ఓలలాడుతున్నా కొత్త సీజన్ ని ఆపేందుకు మేకర్స్ వెనకాడడం లేదు. రకరకాల ప్రయోగాలు చేసేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నారు. అటు బాలీవుడ్ లో వరుసగా సల్మాన్ ఖాన్ హిందీ వెర్షన్ కి హోస్ట్ గా కొనసాగుతుంటే ఇటు సౌత్ లో మాత్రం హోస్టులను మార్చే ఆలోచన చేస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. ఇదంతా టీఆర్పీ ఆటలో ఒక భాగం.
ఎక్కడ టీఆర్పీ తగ్గితే అక్కడ బిగ్ బాస్ ప్రయోగాలకు వెరవడు. ఇటీవలే తెలుగు -బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. కింగ్ నాగార్జున హోస్టింగ్ చేసిన ఈ ఫోలో రేవంత్ టైటిల్ విజేతగా నిలిచాడు. అయితే ఒక విధంగా ఓట్ల కారణంగా శ్రీహాన్ షోను గెలుచుకున్నాడు. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించినా ఆశించిన టీఆర్పీ రాలేదన్న ప్రచారం ఉంది. అయితే ఇంకా సీజన్ 7 గురించి ఉప్పందక పోయినా కానీ రకరకాల ఊహాగానాలు ఫిలింసర్కిల్స్ లో వేడి పెంచుతున్నాయి.
ఈసారి బిగ్ బాస్ -తెలుగు హోస్ట్ మారతారని.. మేకర్స్ కొత్త హోస్ట్ ని తీసుకురావడానికి ప్లాన్ లో ఉన్నారని కథనాలొస్తున్నాయి. రొటీన్ స్కిట్ లు స్టంట్ లతో పరమ బోరింగ్ గా మారిపోయిన బిగ్ బాస్ కి జవజీవాలు పోయాలంటే ఈసారి హోస్ట్ ని మార్చాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. ప్రతిసారీ ఆడియెన్ కింగ్ నాగార్జుననే చూసేందుకు సిద్ధంగా లేరని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే పోయిన బజ్ ని మళ్లీ తీసుకురావడానికి మేకర్స్ పలువురు అగ్ర హీరోలను సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే నటసింహా నందమూరి బాలకృష్ణ బిగ్ బాస్ 7 కి హోస్టింగ్ చేస్తారని కథనాలొచ్చాయి. బాలయ్య ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే బిగ్ బాస్ కోసం సమయం కేటాయించే వీలుందని ఊహాగానాలు సాగాయి. ఆహా టీఆర్పీని అన్ స్టాపబుల్ గా పరుగులు పెట్టిస్తున్న బాలయ్య వస్తే తిరిగి బిగ్ బాస్ హౌస్ పునరుత్తేజం పొందుతుందని కూడా షో నిర్వాహకులు భావిస్తున్నట్టు కథనాలు వచ్చాయి.
కానీ ఇంతలోనే బాబాయ్ ప్లేస్ లో అబ్బాయ్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. బిగ్ బాస్- తెలుగు నిర్వాహకులు ఇప్పటికే యంగ్ యమను సంప్రదించడానికి చాలా ఆసక్తిగా ఉన్నారనే గాసిప్ వైరల్ గా మారింది.
మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఇది షోని మరో లెవల్ కి తీసుకెళ్లింది. కాబట్టి షో టీఆర్పీలను తిరిగి పునరుద్ధరించాలంటే తారక్ మాత్రమే సరిపోతాడని మేకర్స్ భావిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో ఎన్టీఆర్ ని తీసుకురావడానికి షోకి ఎనర్జీతో పాటు కొత్త రూపాన్ని తీసుకురావడానికి ప్లాన్ లో ఉన్నారని తెలిసింది. అతడు ఓకే చెబితే పారితోషికంగా భారీ ప్యాకేజీని ముట్ట జెప్పేందుకు స్టార్ - మా సిద్ధంగా ఉన్నట్టు కథనాలొస్తున్నాయి. అయితే అబ్బాయ్ వస్తాడా? తిరిగి టీఆర్పీలను ఆశించిన రేంజులో గుంజుతాడా.. లేదా? అన్నది వేచి చూడాలి. ప్రస్తుతానికి అబ్బాయ్ వర్సెస్ బాబాయ్ వార్! అంటూ బోలెడంత హంగామా మొదలైపోయింది. ముఖ్యంగా నందమూరి అభిమానుల వాట్సాపు గ్రూపుల్లో సోషల్ మీడియాల్లో ఈ ప్రచారం వేడెక్కిస్తోందని తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.