బిగ్ బాస్ 6 : నామినేషన్స్ షూరూ.. ఈసారి టార్గెట్ ఇనాయని..!

Update: 2022-11-08 06:00 GMT
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ ఆరో సీజన్ సోమవారం నాటికి 64వ రోజుకు చేరుకుంది. ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్లలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా పెద్దగా ఫేమ్ ఉన్న వారేమీ కాదు. దీంతో కొన్ని రోజులపాటు బిగ్ బాస్-6 చాలా చప్పగా సాగుతూ వెళుతోంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ అలరించే టాస్కులతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.

బిగ్ బాస్-6 చివరి దశకు చేరుకుంటుండటంతో కంటెస్టెంట్స్ సీరియస్ గా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు వారాలుగా బిగ్ బాస్ అనుహ్యంగా మలుపులు తిరుగుతూ వెళుతోంది. ఓవర్ యాక్షన్.. యాటిట్యూడ్ తో అందరికీ చిరాకు తెప్పించే గీతూను బిగ్ బాస్ అనుహ్యంగా గత ఆదివారం ఎలిమేట్ చేశాడు. దీంతో గీతూ గుక్క పట్టి ఏడవడంతో నాగార్జున ఆమెను ఓదార్చారు.

ఆదివారం ఎపిసోడ్లో గీతూనే హైలెట్ గా నిలిచింది. ఓవర్ గా ఎమోషన్ అవుతూ గీతు ఏడువడం కొందరికీ కన్నీళ్లు తెప్పిస్తే.. మరికొందరికి ఇదేంట్రా బాబు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? అనిపించింది. ఏది ఏమైనా ఆదివారం ఎపిసోడ్ బాగానే బిగ్ బాస్ కు కావాల్సినంత టీఆర్పీ వచ్చింది. ఇక సోమవారం ఎపిసోడ్ ను నాగార్జున నామినేషన్ ప్రక్రియతో మొదలు పెట్టాడు.  

ఇక ఎప్పటిలాగే నామినేట్ చేయాలనుకున్న వాళ్ల ముఖంపై రంగుపూసి కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. ఈ వారం కెప్టెన్ గా ఉన్న శ్రీసత్య నుంచి మొదట నామినేషన్ ప్రక్రియ మొదలైంది. బాలాదిత్య.. ఇనయాలను శ్రీసత్య నామినేట్ చేసింది. శ్రీసత్య.. శ్రీహన్ ల గురించి ఇనయా కిందటి ఎపిసోడ్లో తప్పుగా మాట్లాడింది. దీనిని దృష్టిలో ఉంచుకొని శ్రీసత్య ఈసారి నామినేట్ చేసింది.

ఆ తర్వాత ఆదిరెడ్డి ఆర్జీవీ భామ ఇనయను.. సింగర్ రేవంత్‌ ను నామినేట్ చేశాడు. దీంతో ఇనయాకి ఆదిరెడ్డికి మధ్య గట్టిగానే గొడవైంది. అలాగే రేవంత్ ఫిజికల్ టాస్క్ లో అందర్నీ కొట్టాడని.. తోసేశాడని నామినేట్ చేయగా నీకు ఆడే దమ్ము లేదంటూ రేవంత్ ఫైరయ్యాడు. ఆ తర్వాత వాసంతి కూడా ఇనయా.. ఆదిరెడ్డిలని నామినేట్ చేసింది.

రేవంత్‌ వాసంతిని ఆదిరెడ్డిలను నామినేట్ చేశాడు.  శ్రీహాన్‌ ను ఇనయాలని కీర్తి నామినేట్ చేసింది.  శ్రీహాన్‌.. ఇనయాలను బాలాదిత్య నామినేట్ చేశాడు. ఆదిరెడ్డి.. ఇనయాలను మెరీనా నామినేట్ చేసింది. ఇనయా.. శ్రీహాన్‌ లను రాజ్‌ నామినేట్ చేశాడు. రేవంత్‌, ఆదిరెడ్డిలను రోహిత్‌ నామినేట్ చేశాడు.

వాసంతి.. మెరీనాలను ఫైమా నామినేట్ చేయగా కీర్తి.. ఇనయాలని  శ్రీహాన్‌ నామినేట్ చేశాడు. ఫైమా.. శ్రీహాన్‌లను ఇనయా నామినేట్‌ చేసింది. మొత్తంగా కంటెస్టెంట్స్ ఈవారం ఇనియాని నామినేషన్స్ పరంగా టార్గెట్ చేసినట్లు కన్పించింది. నామినేషన్స్ జరుగుతున్న సమయంలో కెప్టెన్ శ్రీసత్య శ్రీహన్ రేవంత్ లు కామెడీ చేసుకుంటూ కన్పించారు.

ఆ వెంటనే బిగ్ బాస్ శ్రీసత్యను నువ్వు కెప్టెన్ అయి కూడా ఇలా చేస్తావా? అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో శ్రీసత్య  బిగ్ బాస్ కు క్షమాపణలు చెప్పింది. మొత్తానికి ఈ వారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగడంతో ఎవరు ఎలిమేనేట్ అవుతారా? అనే ఆసక్తి బుల్లితెర అభిమానుల్లో నెలకొంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News