ఈ దీపావళికి రెండు తెలుగు సినిమాలు, రెండు తమిళ అనువాద చిత్రాలు పోటీకి దిగిన విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా విక్టరీ వెంకటేష్ కీలక అతిథి పాత్రలో నటించిన 'ఓరి దేవుడా'. తమిళ హిట్ ఫిల్మ్ 'ఓ మై కడవులే' ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని అశ్వత్ మారిముత్తు తెరకెక్కించాడు. దీనితో పాటు మంచు విష్ణు హీరోగా నటించిన 'జిన్నా' ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత కొంత కాలంగా వరుస ఫ్లాపుల్లో వున్న మంచు విష్ణుకు ఈ మూవీ అగ్ని పరీక్షగా మారింది.
ఈ రెండు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలైన విషయం తెలిసిందే. కార్తి హీరోగా నటించిన 'సర్దార్', శివ కార్తికేయన్ నటించిన ఫన్ ఎంటర్ టైనర్ 'ప్రిన్స్' విడుదలయ్యాయి. ఈ సినిమాలతో ఈ ఏడాది దీపావళి సీజన్ కు శుభం కార్డ్ వేసేశారు. అయితే నవంబర్ 4 నుంచి డిసెంబర్ వరకు అసలు పటాకుల మొత మొదలు కానుందని తెలుస్తోంది. నవంబర్ 4 నుంచి వరుసగా క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నవంబర్ 4న అల్లు శిరీష్ 'ఊర్వశివో రాక్షసివో' రిలీజ్ కాబోతోంది.
ఇదే రోజున సంతోష్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధీ రూపొందించిన 'లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్' రిలీజ్ కాబోతోంది. 'జతారత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ మూవీపైనే మేర్లపాక గాంథీ సంతోష్ శెభన్, ఫరియా అబ్దుల్లా ఆశలు పెట్టుకున్నారు. విభిన్నమైన కథా, కథనాలతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇక డిసెంబర్ 2 న ధనుష్ నటించిన 'సార్' రిలీజ్ కాబోతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇదే డిసెంబర్ 2 న అడివి శేష్ నటించిన 'హిట్ 2' రిలీజ్ కాబోతోంది. శైలేష్ కొలను రూపొందించాడు. నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా పై ఈ మూవీని నిర్మించాడు. హిట్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీపై కూడా భారీ అంచనాలే వున్నాయి. ధనుష్ తొలిసారి తెలుగు దర్శకుడితో చేస్తున్న సినిమా కావండంతో ఈ మూవీపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ మూవీ తరువాత డిసెంబర్ 11న అల్లరి నరేష్, ఆనంది నటించిన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' రిలీజ్ కు రెడీ అవుతోంది.
అయితే డిసెంబర్ 2న విడుదలకు సిద్ధమవుతున్న 'సార్', 'హిట్ 2'లో ఒకరు తప్పుకునే అవకాశం వుందని, ధనుష్ సినిమానే తప్పుకుంటుందని ఇన్‌సైడ్ టాక్. ఇక డిసెంబర్ 8న నందమూరి కల్యాణ్ రామ్ కూడా తన కొత్త సినిమాతో రాబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ మూవీ ద్వారా రాజేంద్రరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
డిసెంబర్ 9న 'పంచ చంత్రం' రిలీజ్ కాబోతోంది. ఇక డిసెంబర్ 23న మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'థమాకా' రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు. ఈ భారీ లైనప్ తో అసలు పటాకుల మోత నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మోత మోగనుందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.