సంకల్ప్ రెడ్డి అనే కొత్త కుర్రాడితో రానా చేసిన 'ఘాజీ' అనే ప్రయత్నం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా జాతీయ అవార్డులు..రివార్డులు సైతం అందుకుంది. కమర్శియల్ గాను సినిమా బాగానే వసూళ్లని రాబ్టటింది. పరిమిత బడ్జెట్ లోనే టెక్నికల్ స్టాండర్స్డ్ ని రిచ్ గా చూపించడంలో వందశాతం సక్సెస్ అయ్యారు. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చిన చిత్రమిది.
దీంతో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని ప్రోత్సహించిన వారెందరో? ఇండస్ర్టీ మొత్తం ఘాజీని ఓ గొప్ప చిత్రంగా అభివర్ణించింది. దీంతో ఇలాంటి ప్రశంసలే అందుకోవాలని మెగా వారసుడు వరుణ్ తేజ్ అటుపై సంకల్ప్ తో అంతరిక్షం అనే స్పేస్ నేపథ్యమున్న ఓ సినిమా చేసాడు. ఇది కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రమే.
కానీ ఘాజీ స్థాయిలో అంచనాలు అందుకోలేదు. మంచి ప్రయత్నమని ప్రశంసలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇలా వరుణ్ ప్రయోగాలకు పెద్ద పీట వేస్తాడని మరోసారి రుజువు చేసాడు. కమర్శియల్ చిత్రాలతో పాటు...ప్రయోగాలకు తగ్గేదేలే అని నిరూపించిన ఏకైక మెగావారసుడు అనిపించుకున్నాడు.
సరిగ్గా ఇప్పుడీ వ్యాఖ్యం మరోసారి సమతూగేలా చేసాడు వరుణ్. అవును మెగా వారసుడు వైమానిక దళ నేపథ్యంలో ఓ చిత్రం చేస్తున్నాడు. కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగానే తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే కథ సిద్దమైంది. డిసెంబర్ లో సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసారు. శక్తి ప్రతాప్ సింగ్ అనుఏ కొత్త కుర్రాడు ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తున్నాడు.
పేరును బట్టి నార్త పంజాబీ వ్యక్తి అని తెలుస్తోంది. పేరులోనే దేశభక్తి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతాప్ ఎయిర్ ఫోర్స్ స్టోరీ వెండి తెరపై అద్భుతంగా మలుస్తాడానే ధీమా వ్యక్తం అవుతుంది. వరుణ్ ఎలాంటి కథ కోసం వెతుకున్నాడో? సరిగ్గా అదే స్టోరీ ప్రతాప్ రూపంలో తన ముందుకెళ్లడంతో మరో మాట లేకుండా స్ర్కిప్ట్ ఒకే చేసినట్లు సమాచారం.
ఈ సినిమా షూటింగ్ ని ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారుట. అందుకోసం విమానయాన సంస్థ సహకారం కూడా తీసుకుంటు న్నట్లు తెలిసింది. అలాగే కొంత మంది మాజీ ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని సైతం కొన్ని పాత్రలకు తీసుకుంటున్నట్లు సమాచారం. వాళ్లకి అవసరమైన ట్రైనింగ్ ఇస్తే మంచి ఔట్ ఫుట్ వస్తుందన్నది ప్లాన్ గా కనిపిస్తుంది. ఇటీవల వాస్తవ కథల్లో ..వాస్తవ పాత్రలనే తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీ వెబ్ సిరీస్ లు ఇలాగే సక్సెస్ అందుకుంటున్నాయి. ఈ సినిమా విషయంలో యువ మేకర్ అదే స్ర్టాటజీతో ముందకెళ్తున్నట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.