నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కలయికలో తెరపైకి రాబోతున్న వీరసింహారెడ్డి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మొత్తానికి మొదటి పాట జై బాలయ్య ఓవర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే కొంత ట్రోలింగ్ కూడా ఎక్కువగానే నడుస్తోంది.
ఈ పాట ఒసేయ్ రాములమ్మ పాట ట్యూన్ కు కాస్త దగ్గరగా ఉంది అని కొంతమంది ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. ఇక నిజానికి ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ పెట్టవచ్చు కదా అని కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి. కానీ నిజానికి కథ ప్రకారం దర్శకుడు వీరసింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథకు సంబంధించిన ఒక విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇందులో బాలకృష్ణ డ్యూయల్ పాత్రలో కనిపించబోతున్నట్లు ముందుగానే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మెయిన్ హీరో పేరు వీరసింహారెడ్డి అని తెలుస్తోంది. ఇక రెండో పాత్రలో బాల వీర సింహా రెడ్డిగా కనిపించబోతున్నారట.
అయితే ఇది తండ్రి కొడుకుల కథగా కొనసాగుతుందట. ముందుగా తమ్ముడి కోసం అన్నయ్య రివెంజ్ తీర్చుకునే వీర సింహారెడ్డి క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. ఇక తరువాత తండ్రి క్యారెక్టర్ కోసం కొడుకుగా బాల వీర సింహారెడ్డి సీన్ లోకి ఎంట్రీ ఇస్తాడట.
ఈ సినిమా స్టోరీ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉండేలా ఉందని అనిపిస్తుంది కానీ గోపీచంద్ మలినేని మాత్రం మాస్ సినిమాలకు ఇచ్చే ట్రీట్మెంట్ కొంత డిఫరెంట్ గా ఉంటుంది.
కాబట్టి అతని స్టైల్ లో ఈ రొటీన్ ఫార్ములా ఎలా ఉంటుంది అనేది వెండితెరపై చూడాలి. ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే. ఇక దునియా విజయం పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.