'వీరసింహారెడ్డి' టైటిల్ తోనే బాలయ్య 107వ సినిమాకి ఓ ఊపు వచ్చింది. నటసింహం అభిమానుల్లో అంచనాలు అంతకంతకు రెట్టింపు అవ్వడం మొదలైంది. సాధారణ టైటిల్ తో తెరకెక్కిన సినిమాల్లోనే బాలయ్య నట విశ్వరూపం చూపిస్తారు. అలాంటి వీరసింహారెడ్డి లాంటి టైటిల్ తో బరిలోకి దిగారంటే? సన్నివేశం ఇంకే రేంజ్ లో ఉంటుందో? ఊహకే అందదు అంటూ అభిమానులు విజిల్స్ కొడుతున్నారు.
సమరసింహారెడ్డి..నరసింహానాయడు...చెన్న కేశవ రెడ్డి తరహాలో వీరసింహారెడ్డి టైటిల్ నెట్టింట సంచలనంగా మారింది. రెడ్డి..నాయుడు కత్తి పట్టాడంటే? ఎలా ఉంటుందో మరోసారి బాలయ్య రూపంలో కనిపిస్తుందంటూ గెస్సింగ్స్ జోరుగా తెరపైకి వస్తున్నాయి. మరి ఆ అంచనాలు సంచలనాలు అవ్వాలంటే? బాలయ్య-గోపీచంద్ మలినేని కూడా అంతే శ్రమించాలి.
బాలయ్య లో ఆ మాస్ యాంగిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కత్తి పట్టి నరకడం మొదులు పెడితే? ఏ పీస్ ఎవరిదో తెలుసుకోవడానివిక వారం పడుతుంది అన్న తరహాలోనే ఉంటుంది. పోరాట సన్నివేశాల్లో బాలయ్య విశ్వరూపం చూపిస్తారు. ఇటీవలే అఖండలో ఏ రేంజ్ లో చెలరేగారో చెప్పాల్సిన పనిలేదు. జనాలు తండోపతండాలుగా ట్రాక్టర్లపైనే తరలి వచ్చిన సన్నివేశం ఎదురైంది.
దశాబ్ధాల తర్వాత చోటు చేసుకున్న మరో అరుదైన ఘటన ఇది. కేవలం అఖండ నట విశ్వరూపం కోసమే ప్రేక్షకులు ఆస్థాయిలో నీరాజనాలు పట్టారు. బోయపాటి విజువలైజేషన్ కి బాలయ్య అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చారు. ఆ ఫైట్స్ వెనుక స్ంట్ మాస్టర్ల కృషి ఎంతో ఉంది. అందుకే ఇప్పుడు వీరసింహారెడ్డి లో యాక్షన్ సన్నివేశాల ఎలివేషన్స్ బోయపాటి మార్క్ తలపించాలని బాలయ్య స్ర్టాంగ్ గా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఆ సినిమాకి పని చేసిన స్టంట్ మాస్టర్స్ ఆధ్వర్యంలోనే గోపీచంద్ మలినేని ఓ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేసినట్లు సమాచారం. అందులో బాలయ్య మరోసారి ఇరగదీశాడని అంటున్నారు. ఎలివేషన్ పరంగా ఆ ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని వినిపిస్తుంది. గోపీచంద్ మలినేని ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు.
యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడంలో అతను సిద్ద హస్తుడే. భారీ యాక్షన్ సన్నివేశాల్లో తన మార్క్ తప్పనిరిగా ఉంటుంది. అలాంటి మేకర్ కి అఖండ లాంటి మాస్టర్స్ కుదిరితే ఇంకే స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య ఆ ప్లానింగ్ తోనే ఇలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.