ఆలియా పెళ్లిలో మెరుపులు ఉరుములు

Update: 2022-04-14 11:30 GMT
ఆలియా పెళ్లిలో మెరుపులు ఉరుములు తురుములు చూడాల‌నుందా? అయితే ఈ వీడియో చూడండి అంటూ బాలీవుడ్ మీడియా ఒక‌టే పాత వీడియోల్ని తిప్పి తిప్పి వేస్తున్నాయ్. ఓ వైపు నేటి (గురువారం) ఈ పెళ్లిని అత్యంత ర‌హ‌స్యంగా లీకులేవీ లేకుండా చేసుకోవాల‌ని ఆలియా-ర‌ణ‌బీర్ జంట త‌పిస్తుంటే వెంట‌ప‌డి వేధించి మ‌రీ ఒక్కో ఫోటోని లీక్ లిస్తున్నాయి మీడియాలు.

ఇంత‌లోనే కరిష్మా కపూర్- రిద్ధిమా కపూర్- ఆలియా భట్- రణబీర్ కపూర్ మెహందీ వేడుక తర్వాత మొదటి ఫోటోలను పంచుకున్నారు. ఇవి మీడియాకు హాట్ టాపిక్ అయ్యాయి. బుధవారం అలియా భట్ -రణబీర్ కపూర్ మెహందీ వేడుకకు హాజరైన తర్వాత కరిష్మా కపూర్ - రిద్ధిమా కపూర్ తమ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక చిత్రాన్ని వీడియోను పంచుకున్నారు. నిజానికి ఈ పెళ్లికి కాపలా వ్యవహారంలో సన్నిహిత కుటుంబ సభ్యులు .. స్నేహితులు మాత్రమే భాగంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి రణ్ బీర్ సోదరి రిద్ధిమా కపూర్ సాహ్ని- కజిన్ కరిష్మా కపూర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వేడుక తర్వాత- కరిష్మా మరియు రిద్ధిమా తమ మెహందీ డిజైన్ లను చూపించడానికి ఒక ఫోటోని వీడియోను పంచుకున్నారు.

కరిష్మా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో మెహెందీ డిజైన్ ను తన పాదాలకు దగ్గరగా పంచుకుంది. ఆమె హార్ట్ ఎమోటికాన్ తో పాటు ''నేను మెహందీని ప్రేమిస్తున్నాను'' అని క్యాప్షన్ ఇచ్చింది. కరిష్మా పసుపు రంగు అనార్కలీ సూట్ లో మాంగ్టికా .. సాంప్రదాయ చెవిపోగులతో వేడుకకు హాజరయ్యారు.

అలియా భట్-రణబీర్ కపూర్ పెళ్లి లో అతిథులు సంద‌డి పెరుగుతోంది. ఇప్ప‌టికే షెహనాజ్ గిల్,.. జెతలాల్స్ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఈవెంట్ ను కవర్ చేయడానికి మీడియా నానా విధాలుగా తంటాలు ప‌డుతోంది. బ్రహ్మాస్త్ర టీమ్ అలియా భట్-రణబీర్ కపూర్ పెళ్లి కానుక విడుదలైంది. వారి ఆన్-సెట్ రొమాన్స్ వీడియో ఇంత‌కుముందే వైర‌ల్ అయ్యింది.

మెహందీ తర్వాత చిన్న సంగీత వేడుక కూడా జరిగింది. పింక్ విల్లా నివేదిక ప్రకారం.. గాయకుడు ప్రతీక్ కుహాద్ వేదిక వద్ద కనిపించాడు .. అతను ఈ సందర్భంగా కొన్ని పాటలు కూడా పాడాడు. సూరత్ కు చెందిన ఓ ఆభరణాల వ్యాపారి రణబీర్- అలియాలకు భారీ బంగారు పూతతో కూడిన బొకేను బహుమతిగా ఇచ్చాడు.

ఫంక్షన్ ముగిసిన తర్వాత నీతు- రిద్ధిమాలను ఛాయాచిత్రకారులు గుర్తించారు. ఆ త‌ర్వాత‌ ఏప్రిల్ 14 గురువారం పెళ్లి జరగనుందని వారు ధృవీకరించారు. అలియా గురించి మాట్లాడుతూ.. ఆమె చాలా క్యూట్ గా ఉందని వారు పొగిడేశారు. ఆర్.ఆర్.ఆర్ లాంటి గ్రాండ్ స‌క్సెస్ త‌ర్వాత పెళ్లితో ఓ ఇంటిదైపోతోంది ఆలియా. ఈ పెళ్లి వేడుక విందు అప్ డేట్స్ గురించి ఇక్క‌డ ఫాలో అవ్వండి.
Tags:    

Similar News