'విరాటపర్వం' స్పీడ్‌ పెంచకుంటే కష్టమే..!

Update: 2022-06-03 05:30 GMT
రానా.. సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన విరాటపర్వం సినిమా గురించిన చర్చలు దాదాపు రెండున్నర మూడు సంవత్సరాలుగా జరుగుతున్నాయి. సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. మద్య లో రానా అనారోగ్య సమస్యలు మరియు ఇతర కారణాల వల్ల సినిమా చాలా ఆలస్యం అయ్యింది. సినిమాలో సాయి పల్లవి ఉండటం వల్ల ఖచ్చితంగా మంచి హైప్ క్రియేట్‌ అయ్యింది.

ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌ అవ్వడంతో పాటు ఒక పల్లెటూరు పీరియాడిక్‌ డ్రామా కథతో ఈ సినిమాను రూపొందించారు. దాంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా ఎంత వరకు ఎక్కుతుంది... యూత్‌ కు ఈ సినిమా ఏ మేరకు నచ్చతుంది అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్‌ స్టప్‌ అంతా కూడా విరాటపర్వం ఒక నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌ సినిమా.. కమర్షియల్‌ ఎలిమెంట్స్ పెద్దగా ఉండని సినిమా అన్నట్లుగానే చెబుతూ వచ్చాయి. సినిమా విడుదలకు ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో సినిమా ను ఎక్కువ శాతం జనాలకు చేరువ చేయడం కోసం ప్రమోషనల్‌ స్టైల్‌ ను మార్చాల్సిన అవసరం ఉంది.

సాయి పల్లవి పేరు చెప్పి కొంత మందిని వరకు సినిమా థియేటర్ కు రప్పించగలరు. కాని సాయి పల్లవి ఉన్నా కూడా ఫ్యామిలీ ఎలిమెంట్స్.. ఇతర ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్ ఉన్నాయని ప్రమోషన్ ద్వారా చెబితేనే ఎక్కువ శాతం మందికి సినిమా ను చేరువ చేయగలరు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు పెంచాలంటూ సినీ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు సలహాలు ఇస్తున్నారు.

సాయి పల్లవి లుక్‌ మరియు ఆమె నటన ఖచ్చితంగా సినిమాకు హైలైట్‌ గా నిలుస్తాయి. సాయి పల్లవికి ఉన్న స్టార్‌ డమ్‌ ను ఉపయోగించుకుని ప్రేక్షకులను థియేటర్ల ముందు క్యూ లో నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో ఇప్పటికే టీజర్ మరియు పోస్టర్ లను విడుదల చేశారు.

కాని ఇంకాస్త బెటర్‌ గా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని చెప్పడానికి ఈ రెండు వారాల ప్రమోషన్ కార్యక్రమాలను వినియోగించుకోవాలి అనేది కొందరి సలహా.
Tags:    

Similar News