కన్నడ సీనియర్ స్టార్ హీరోలలో ఉపేంద్ర స్థానం ప్రత్యేకం. నటుడిగా ఆయన లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. కథాకథనాలపై ఆయనకి మంచి పట్టు ఉంది. అందువలన అప్పుడప్పుడు విభిన్నమైన కథలను రాసుకుని .. విలక్షణమైన పాత్రలను డిజైన్ చేసుకుని ఆయనే మెగా ఫోన్ పట్టేస్తూ ఉంటారు. తాను అనుకున్న అంశాన్ని తెరపై ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేయడం .. చూపించేయడం ఆయన నైజం. ఆయన లోని ఆ లక్షణం కొంతమందికి నచ్చితే .. మరికొందరు విమర్శించడానికి కారణమైంది.
సాధారణంగా తమిళ సినిమా హీరోలు మొదటి నుంచి కూడా తెలుగులో తమ సినిమాలను దిగుమతి చేస్తూనే వస్తున్నారు. కానీ కన్నడ సినిమా హీరోలు తెలుగు వైపు పెద్దగా దృష్టిపెట్టిన దాఖలాలు కనిపించవు. కానీ తన కెరియర్ మొదటి నుంచే కన్నడ సినిమాలతో పాటు తెలుగు సినిమాలు కూడా చేస్తూ వెళ్లిన కన్నడ హీరోగా ఉపేంద్ర తన ప్రత్యేకతను చాటుకున్నాడు. చిత్రవిచిత్రమైన తన గెటప్స్ తో .. మేనరిజమ్స్ తో తెలుగు ప్రేక్షకుల దృష్టిని కూడా తన వైపు తిప్పుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు.
'ఓం' .. 'ఎ' .. 'రా' సినిమాలను ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాలను ఒక వర్గం ప్రేక్షకులు ఎక్కువగా చూశారు. మిగతా వాళ్లు మాత్రం ఇవన్నీ ఒక కూడా ప్రేమ పేరుతో తెరకెక్కిన ఉన్మాదానికి సంబంధించిన సినిమాలుగా భావించారు. తన మనసుకు తోచినట్టుగా సినిమాలు చేసే నటుడిగా ఆయనకి ఒక ముద్ర పడిపోయింది. అందువలన ఆ తరువాత ఆయన సినిమాలకు అంతగా ఆదరణ లభించలేదు. ఆయన కూడా ఇక ఈ వైపుకు ఎక్కువగా రాలేదు. ఇక ఈ మధ్యనే 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో ఆయన తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రను చేసి మెప్పించారు.
నటుడిగా తన మార్కు సినిమాలు చేసిన ఉపేంద్ర .. దర్శకుడిగా కూడా అదే తరహా సినిమాలను ఇతర హీరోలతో తెరకెక్కించారు. వాటిలో ఆదరణ పొందిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇక తన సినిమాల్లో తన పాత్రలకి పాటలు పాడుకోవడం ఆయనకి ఒక హాబీ. అందువలన సింగర్ గా కూడా ఆయన ప్రయోగాలు చేశాడనే అనాలి. ఒకప్పుడు మాంచి వయసులో ఉండగా ఆయన ఉద్ధృతి వేరు. ఇప్పుడు ఆయన దర్శకుల నటుడిగా మారిపోయారు. వాళ్లకి కావలసిన అవుట్ పుట్ ఇస్తున్నాడు ... ఉపేంద్ర మంచి ఆర్టిస్ట్ అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆయన 'గని' సినిమా చేస్తున్నాడు. ఈ రోజున ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని విజయాలను అందుకోవాలని మనసారా కోరుకుందాం.