సౌత్ ఇండస్ట్రీలో కరోనా లాక్డౌన్ తర్వాత విడుదలై సూపర్ హిట్ అందుకున్న సినిమాలు ఉప్పెన, మాస్టర్. మెగాహీరో పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ఉప్పెన. ఈ సినిమాతో బుచ్చిబాబు సాన అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది.
అదేవిధంగా దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధానపాత్రలలో తెరకెక్కిన సినిమా మాస్టర్. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన మూడో సినిమా కావడంతో సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అలాగే ఇద్దరు స్టార్స్ విజయ్, విజయ్ సేతుపతిల క్రేజ్ తో సినిమా ఓ రేంజిలో కలెక్షన్స్ రాబట్టింది. మాస్టర్ సినిమా విజయ్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూల్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ రెండు సినిమాలకు ప్లస్ పాయింట్ ఏంటంటే.. థియేటర్లలో 100% సీటింగ్ అనుమతి లభించడం. ఆ విధంగా ఇటు ఉప్పెన.. అటు మాస్టర్ (తమిళ, తెలుగు) భాషల్లో మంచి కలెక్షన్స్ నమోదు చేసాయి.
ఇదిలా ఉండగా.. ఈ రెండు సినిమాలు కూడా ఇటీవలే ఓటిటి రిలీజ్ తర్వాత ఫస్ట్ టైం బుల్లితెరపై ప్రసారమయ్యాయి. ఏప్రిల్ 18న ఉప్పెన సినిమా 'స్టార్ మా' ఛానల్లో.. మాస్టర్ సినిమా జెమినీ ఛానల్లో సాయంత్రం ప్రసారమయ్యాయి. మరి థియేటర్లో దుమ్ము దులిపిన సినిమాలు టీవీలో ఎలాంటి టిఆర్పి రేటింగ్ నమోదు చేసాయో చూద్దాం. ఉప్పెన సినిమా స్టార్ మా ఛానల్లో ఫస్ట్ టైం ప్రసారమై 18.5 టిఆర్పీ రేటింగ్ నమోదు చేయగా.. మాస్టర్ సినిమా జెమినీ ఛానల్లో ప్రసారమై 4.8 రేటింగ్ అందుకుంది. అయితే ఓ విధంగా ఉప్పెన తెలుగు స్ట్రెయిట్ సినిమాగా అద్భుతమైన రేటింగ్ అందుకోగా.. డబ్బింగ్ సినిమాగా మాస్టర్ 4.8తో పరవాలేదని అనిపించింది. మొత్తానికి ఈ రెండు సినిమాలు థియేట్రికల్ గా మాత్రం సూపర్ హిట్ అందుకున్నాయి.