యానిమల్‌తో పోలికా? అతడి అంచనా ఫెయిల్!
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన `యానిమల్` బాక్సాఫీస్ వద్ద దాదాపు 900కోట్లు వసూలు చేసింది.
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన `యానిమల్` బాక్సాఫీస్ వద్ద దాదాపు 900కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో నటించిన రణబీర్ కపూర్ సహా ఇతర నటీనటులకు మంచి పేరొచ్చింది. 2023లో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు `బేబి జాన్` కూడా అదే స్థాయి హిట్టవుతుందని, వరుణ్ ధావన్ పాన్ ఇండియన్ స్టార్ గా నిరూపిస్తాడని వ్యాఖ్యానించిన అట్లీకి చీవాట్లు ఎదురవుతున్నాయి.
వరుణ్ ధావన్- కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో అట్లీ నిర్మించిన బేబి జాన్ ఈ క్రిస్మస్ నాడు విడుదలై కేవలం 12 కోట్ల లోపు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇదే క్రిస్మస్ నాటికి మూడోవారంలోను ఆడుతున్న పుష్ప 2 చిత్రం ఈ సెలవు రోజు ఏకంగా 19 కోట్లు వసూలు చేయడం సంచలనంగా మారింది. నిజానికి బేబి జాన్ డే1 కలెక్షన్స్ ఊహించనిది. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.
వరుణ్ ధావన్ నెక్ట్స్ లెవల్ పాన్ ఇండియన్ స్టార్ అంటూ కీర్తించినా కానీ అతడి నటనపై అందరూ అనుకూల సమీక్షలు ఇవ్వలేదు. హిందీ మీడియాలు తమ సమీక్షల్లో వరుణ్ ధావన్ ని పొగిడేసినా కానీ, చాలా సౌత్ సమీక్షకులు అతడి పాత్రను మెచ్చలేదు. ఒరిజినల్ అయిన తేరిలో దళపతి విజయ్ నటనతో ధావన్ ని పోలుస్తూ ఆ రేంజును మ్యాచ్ చేయలేకపోయాడని విమర్శించారు.
యానిమల్ లో సందీప్ వంగా హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్ చేయగా, బేబీ జాన్ చిత్రం మొత్తం నిరాశపరిచిందని విమర్శలొస్తున్నాయి. ఇలాంటి తెలివితక్కువ వాదనలు చేసినందుకు అట్లీ క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియాలో ప్రజలు కోరుతున్నారు.