నేటి సోషల్ మీడియా సమాజంలో సెలబ్రిటీలపై ట్రోలింగ్ అనేది కామన్. నెటి జనులకి ఎవరూ అతీతులు కారు. స్టార్ సెలబ్రిటీల నుంచి చిన్నా చితకా వరకూ అందరూ ఏదో రూపంలో ట్రోలింగ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ వేవ్ లో ఎక్కువగా హీరోయిన్లు టార్గెట్ అవుతుంటారు. బాడీ షేమింగ్ లపై.. డ్రెస్సింగ్ సెన్స్ పై..ఆన్ స్ర్కీన్ పై బోల్డ్ అటెంప్ట్ లపై తరుచూ హీరోయిన్లు ట్రోలింగ్ గురవ్వడం పరిపాటిగా మారింది.
తాజాగా బాలీవుడ్ నటి.. `బిగ్ బాస్` ఫేం ఉర్పీ జావెద్ ట్రోలర్లకి ఆహారంగా మారిపోయింది. పలుచని దుస్తుల్లో అందాలు ఆరబోసిన ఉర్పీపై ట్రోలర్స్ ఎటాకింగ్ కి దిగారు. దోమతెర కంటే పలుచని ఆ డ్రెస్ ఏంటి? అంటూ ట్రోల్ చయడం మొదలు పెట్టారు. దీనిపై వెబ్ మీడియా లో ప్రత్యేక కథనాలు అల్లుకున్నాయి. ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ఊర్పీని ఓరేంజ్ లో టార్గెట్ చేసి విమర్శించింది.
పనిలో పనిగా సమంత ఆ మధ్య పలుచని పింక్ దుస్తుల్లో కనిపించిన ఫోటోని బయటకు తీసి రెండు ఫోటోల్ని పోల్చి ఆర్టికల్ అచ్చేసింది. దీంతో ఆ రెండు వార్తల్ని...ఫోటోల్ని స్ర్కీన్ షాట్లు తీసి ఉర్పీ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ ద్వారా అభిమానులకు షేర్ చేసింది. నాకొక న్యాయం...సమంతకు మరో న్యాయమా? ఇదెక్కడి చట్టం అంటూ ట్రోలర్లపై ప్రతి దాడికి దిగింది.
అలాంటి దుస్తుల్లో సమంత వేసుకుంటే అందంగా ఉందని పొగుడుతారు..నేను వేసుకుంటే విమర్శిస్తారా? అంటూ నిప్పులు చెరిగింది. సమంత అంటే నాకు కూడా ఇష్టమే. నేను కేవలం ఇక్కడ విమర్శల గురించి మాత్రమే ప్రస్తావిస్తునాను..ఎదుట వారిని ఈవివాదంలోకి లాగాలని కాదని వివరణ ఇచ్చింది. దీంతో ట్రోలర్లకి సౌండ్ లేదు.
నిజమే సోషల్ మీడియా అనే చట్టం అందరికీ ఒకే విధమైన న్యాయం చేయాలి కదా? అది ఉర్పీ జావెద్ విషయంలో ఎందుకు జరగలేదంటూ ఉర్పీ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక సమంత ఫాలోవర్స్ అయితే ఈ తంతు చూసి వెంకి పెళ్లి సుబ్బిగాడి చావుకొచ్చినట్లుందని అంటున్నారు. ఉర్పీ జావెద్ సమంతని ఉదహరించడంలో తప్పులేదు.
కానీ ఇలాంటి ట్రోలింగ్ వివాదాల్లోకి లాగకూడదంటున్నారు. ట్రోలింగ్ బారిన పడితే ఎవరికి వారు వ్యక్తిగతంగా బధులివ్వాలి తప్ప..మరొకర్ని మధ్యలాకి లాగి ఇబ్బంది పెట్టకూడదని అభిమానులు కోరుతున్నారు. తెలిసో తెలియకో సమంతని లాగారు కాబట్టి అమెని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదు. సెలబ్రిటీల రెగ్యులర్ లైఫ్ లో ఇవన్నీ సహజం. వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు.