నీది వక్రబుద్ధి.. అమ్మాయిలను తప్పుపడతావా? అంటూ ప్రముఖ నవలా రచయితను బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ చెడామడా తిట్టేసింది. ప్రస్తుతం ఇది బాలీవుడ్ సహా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇంతకీ ఎవరా స్టార్ రైటర్ అంటే... ఇంకెవరు.. తనవైన రచనలతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన భారతీయ రచయిత చేతన్ భగత్. యువతరం దృష్టి మరల్చడం ఉర్ఫీ పని! అంటూ వ్యాఖ్యానించినందుకు అతడిపై ఆమె సివంగిలా విరుచుకుపడింది. ``నువ్వు వక్రబుద్ధి గలవాడివి కాబట్టి.. అది అమ్మాయి తప్పు అని అర్థం కాదు`` అంటూ తనదైన శైలిలో చికాకును ప్రదర్శించింది ఉర్ఫీ. యువతలో పరధ్యానానికి ఉదాహరణ ఆవిడ! అంటూ కామెంట్ చేసిన చేతన్ భగత్ కి ధీటైన కౌంటర్ వేయకుండా విడిచిపెట్టలేదు.
ఇంటర్నెట్ సంచలనం .. బిగ్ బాస్ OTT మాజీ కంటెస్టెంట్ ఉర్ఫీ జావేద్ తన విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్ తో ఇప్పటికే యూత్ లో హాట్ ఫేవరెట్ గా మారింది. ఉర్ఫీ నుంచి అప్ డేట్ల కోసం చకోర పక్షుల్లా సోషల్ మీడియాలను అంటిపెట్టుకునే బాపతు యువతరం లేకపోలేదు. వీళ్లందరినీ ఉర్ఫీ తప్పుదారి పట్టిస్తుందని సదరు రచయిత తెలిసో తెలియకో విమర్శించారు. దాని పర్యవసానం ఇప్పుడు అంతే ఘాటైన పంచ్ ని ఎదుర్కోవాల్సొచ్చింది.
ఆన్ లైన్ ట్రోలర్లను టీజ్ చేస్తూ తెలివిగా తన నుంచి కళ్లు తిప్పుకోనివ్వని ట్రిక్ ని ఉపయోగించే ఉర్ఫీ పై ఇప్పుడు చేతన్ భగత్ దృష్టి మరలడం కూడా యువతరంలో చర్చగా మారింది. ఆయన తెలిసో తెలియకో ఉర్ఫీని కెలికారన్న గుసగుస వైరల్ అవుతోంది.
ఇటీవల నవలా రచయిత చేతన్ భగత్ ఒక సాహితీ ఉత్సవానికి హాజరయ్యారు. ఈ వేదికపై ఊర్ఫీ గురించి క్లుప్తంగా మాట్లాడాడు. యువతలో ముఖ్యంగా అబ్బాయిలలో ఆమె ``పరధ్యానం``కి ఎలా ఉదాహరణగా మారిందో ఛమత్కరించాడు. ``యువతకు.. అందునా ముఖ్యంగా అబ్బాయిలకు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ను చూస్తూ గంటలకొద్దీ సమయం గడిపేవారికి సెల్ ఫోన్ గొప్ప పరధ్యానంగా మారింది. ఉర్ఫీ జావేద్ ఎవరో అందరికీ తెలుసు. సరిహద్దుల్లో దేశాన్ని రక్షించే భారత సైనికుల్లోను యువత ఉన్నారు. ఇక్కడ మన యువత మంచాన పడుతున్నారు. ఉర్ఫీ జావేద్ ఫోటోలను చూసి అదే పనిగా..!`` అంటూ కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించారు చేతన్.
దానికి ప్రతిస్పందిస్తూ ఊర్ఫీ తన ఇన్ స్టాలో చెలరేగిపోయింది. ఊర్ఫీ ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె ``సాహితీ ఉత్సవం``లో తన గురించి మాట్లాడినందుకు రచయితను నిందించింది. నాకు ఒక విషయం అర్థం కాలేదు. సాహిత్యోత్సవంలో నా పేరు ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? అంటూనే... #MeToo ఉద్యమం సమయంలో లీక్ అయిన చేతన్ భగత్ వైరల్ వాట్సాప్ సందేశాల స్క్రీన్ షాట్ లపై కూడా ఊర్ఫీ పంచ్ లు విసిరింది.
``అతడి లాంటి మగాళ్లు తమ స్వీయ లోపాలను అంగీకరించడం కంటే ఎల్లప్పుడూ మహిళలను నిందిస్తారు. మీరు వక్రబుద్ధి గలవారు కాబట్టి దానికీ అమ్మాయిలదే తప్పు!? ఆమె ఏం ధరించింది అనేది పాయింట్ కాదు. అనవసరంగా నన్ను ఇలాంటి భాషలోకి లాగడం సరైనది కాదు.. నా దుస్తులు చిన్నపిల్లల దృష్టి మరల్చాయని మీరు వ్యాఖ్యానించడమా? మీ వంటి పెద్దలు అమ్మాయిలకు మెసేజ్ చేయడం వారికి ఆటంకం కాదా?`` అంటూ చేతన్ భగత్ పై సుదీర్ఘ సందేశంలో చెలరేగింది ఉర్ఫీ. అతడిని పర్వర్ట్ అని కూడా వ్యాఖ్యానించింది.