కమెడియన్ కూతురి హీరోయిన్ అవతారం

Update: 2015-12-21 11:30 GMT
టాలీవుడ్ తారలు తమ కూతుళ్ల ను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ముందుకొస్తున్నారు. రీసెంట్ గా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తన పెద్ద కూతురు శివానిని హీరోయిన్ గా పరిచయం చేయనుంటే.. ఇప్పుడు ఓ కమెడియన్ డాటర్ కూడా హీరోయిన్ అవతారం ఎత్తింది.

కమెడియన్ ఉత్తేజ్ దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. కేవలం కామెడీ యాక్టర్ గానే కాకుండా.. రైటర్ గానూ పలు చిత్రాలను పని చేశాడు. ఇప్పుడు ఉత్తేజ్ కూతురు చేతనకు  హీరోయిన్ గా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తను  హీరోయిన్ అవాలని రెండేళ్ల నుంచీ కోరుకుంటోంది ఈ అమ్మాయి. ఇప్పుడు తండ్రి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, సరైన అవకాశం దక్కడంతో.. అరంగేట్రం చేసేస్తోంది. "షి" అనే హారర్ చిత్రంతో ఈ చిన్నది తెరపై అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. రాఘవేంద్ర మహత్,, చేతనలు హీరో హీరోయిన్లు కాగా.. వీరిద్దరి మధ్య అందమైన ప్రేమ కథ నడుస్తూంటుంది. మరోవైపు శ్వేతా మీనన్.. హారర్ పార్ట్ ని లీడ్ చేయనుంది.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీని.. శరవేగంగా పూర్తి చేసి, సమ్మర్ నాటికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. "నేను బాలనటిగా అనేక సినిమాల్లో నటించాను. అయితే హీరోయిన్ గా మాత్రం నాకు ఇదే తొలి సినిమా. కొంచె టెన్షన్ గా మాట వాస్తవమే అయినా.. ప్రేక్షకులు నన్ను ఆదరిస్తానని నమ్ముతున్నా" అంటోంది చేతన. మొత్తానికి తెలుగులో సినీతారల కూతుళ్లు హీరోయిన్ గా మారే ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది.
Tags:    

Similar News