ఫ్లాపులిచ్చిన హీరోలకు తిరిగి మరో అవకాశం ఇవ్వడం అంటే అది ఎంతో గొప్ప డేర్ ఉంటేనే సాధ్యం. హిట్టు సెంటిమెంటును ఫాలో అయ్యే పరిశ్రమలో.. హిట్టు హీరోల కోసం ఎగబడే ప్రపంచంలో.. ఫ్లాపు హీరోని పిలిచి అవకాశం ఇవ్వడమంటే మాజాకానా? కానీ ఆ సాహసం చేస్తున్నాయి కొన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు. మంచి సత్సంబంధాల కోసం ఈ రిస్క్ చేస్తున్నాయనడంలో సందేహం లేదు. ఇటీవలే మాస్ మహారాజా రవితేజతో - అక్కినేని నాగచైతన్యతో సినిమాలు చేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. ఫ్లాపుల్లో ఉన్నా రవితేజకు అవకాశం ఇచ్చింది. కానీ ఫ్లాపునే ఎదుర్కొంది. ఇక హిట్టిస్తాడనుకున్న చైతూ సైతం ఆ కంపెనీకి ఫ్లాపునే ఇచ్చాడు.
అదంతా అటుంచితే సవ్యసాచితో ఫ్లాపు కొట్టిన చైతన్యకు హిట్టిచ్చే సంస్థ ఏది? అంటే ప్రస్తుతం యు.వి.క్రియేషన్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో చైతన్య హీరోగా నటించే సినిమాకి ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఓమారు యువి క్రియేషన్స్ హిస్టరీ పరిశీలిస్తే.. ఈ కంపెనీ ఫ్లాపు హీరోలకు ఛాన్సులిస్తూ హిట్టు కొట్టి గొప్ప ట్రాక్ రికార్డును సొంతం చేసుకుంది. గతం చూస్తే.. వరుస ఫ్లాపుల్లో ఉన్న యువహీరో శర్వానంద్ కి `రన్ రాజా రన్`లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చింది. ఆ తర్వాత శర్వా కెరీర్ అజేయంగా పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. సేమ్ సన్నివేశంలో డబుల్ హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్న నానీకి సైతం `భలే భలే మగాడివోయ్` లాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చింది ఈ సంస్థనే. ఆ తర్వాత నానీ సీనేంటో తెలిసిందే. నేచురల్ స్టార్ గా వరుస బ్లాక్ బస్టర్లతో కాలరెగరేస్తున్నాడు అతడు. ఇలా యువహీరోలతో వేరొక కంపెనీ భాగస్వామ్యంతో యువీ సంస్థ చేసిన ప్రయోగాలన్నీ సక్సెస్.
ఇకపై అక్కినేని హీరో వంతు. నాగచైతన్య గత కొంతకాలంగా సక్సెస్ ట్రాక్ లో ఉన్నా అనూహ్యంగా `సవ్యసాచి` లాంటి బిగ్ ఫ్లాప్ నివ్వడం పరిశ్రమలో ప్రముఖంగా చర్చకొచ్చింది. ఆ క్రమంలోనే చైతూకి లిఫ్ట్ ఇచ్చేందుకు యువి సంస్థ సన్నాహాలు చేయడం పైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఒక్క ఫ్లాపుతో వెంటనే ఫ్లాప్ హీరో అని ముద్ర వేయలేం. ఫ్లాపిచ్చిన హీరో కదా అని చేపట్టిన ప్రాజెక్టును మధ్యలో వదిలేయడం ధర్మం కాదన్న పాలసీతో యువి సంస్థ అవకాశాలిస్తోంది. అయితే యువి సంస్థ గతంలో గీతా ఆర్ట్స్2తో కలిసి యువహీరోల్ని ప్రోత్సహిస్తూ సినిమాల్ని నిర్మించింది. ఈసారి మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థతో కలిసి చైతూ సినిమాని నిర్మిస్తోంది. యువీ సంస్థ - పీవీపీ మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి పూర్తి వినోదాత్మక చిత్రానికి సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు సాగుతున్నాయి. ప్రారంభోత్సవం ఎప్పుడు? కాస్టింగ్ ఎవరు? ఇతరత్రా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందింకా.