అంతా ఆ బేనర్ మహిమ..

Update: 2018-01-28 06:04 GMT
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పెద్ద బేనర్లకు ఉన్న క్రెడిబిలిటీనే వేరు. ఆ బేనర్ల నుంచి సినిమాలు వస్తున్నాయంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత కచ్చితంగా ఉంటుందన్న భరోసా ప్రేక్షకుల్లో ఉంటుంది. ప్రస్తుతం అలాంటి గుర్తింపుతో కొనసాగుతున్న బేనర్లు.. గీతా ఆర్ట్స్.. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్.. యువి క్రియేషన్స్. వీటిలో చివరి బేనర్ ప్రొడక్షన్లోకి వచ్చి ఐదేళ్లే అయింది. ఐతే చాలా త్వరగా ఈ బేనర్ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ‘మిర్చి’ లాంటి బ్లాక్ బస్టర్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థలో మెజారిటీ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ బేనర్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో పూర్తిగా నిరాశ పరిచిన సినిమా లేదంటే ఆశ్చర్యపోవాల్సిందే.

తాజాగా ‘యువి క్రియేషన్స్’నుంచి భాగమతి వచ్చింది. ఈ సినిమా తీయడానికి ముందు దర్శకుడు జి.అశోక్ ట్రాక్ రికార్డు పేలవంగా ఉంది. ‘పిల్ల జమీందార్’ లాంటి హిట్టుతో దర్శకుడిగా పరిచయం అయినప్పటికీ.. ఆ తర్వాత అతను తీసిన ‘సుకుమారుడు’.. ‘చిత్రాంగద’ దారుణమైన ఫలితాన్నందుకున్నాయి. దీంతో ‘భాగమతి’ మీదా జనాలకు నమ్మకం లేకుండా పోయింది. కాకపోతే యువి క్రియేషన్స్ వాళ్ల సినిమా అన్నది ఒక్కటే భరోసా. ఈ చిత్రం అంచనాల్ని పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినప్పటికీ.. ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది. మంచి వసూళ్లు సాధిస్తోంది. ‘చిత్రాంగద’ లాంటి చెత్త సినిమా తీసిన దర్శకుడి నుంచి ‘భాగమతి’ లాంటి సినిమా రావడం కచ్చితంగా ఆశ్చర్యపరిచే విషయమే. ఇక్కడే బేనర్ వాల్యూ అనేది తెలుస్తోంది. ఒక క్రెడిబిలిటీ ఉన్న బేనర్లో చేస్తున్నపుడు ప్రతి ఒక్కరూ ఆటోమేటిగ్గా ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. తమ అత్యుత్తమ సామర్థ్యంతో పని చేసే ప్రయత్నం చేస్తారు. అలా అశోక్ మాగ్జిమం ఎఫర్ట్ పెడితే.. యువి వాళ్లు తమ స్థాయికి తగ్గట్లుగా చక్కటి నిర్మాణ విలువలతో ‘భాగమతి’కి సపోర్ట్ ఇచ్చారు. అందుకే ‘భాగమతి’కి ఆ మాత్రం ఔట్ పుట్ వచ్చిందని చెప్పాలి.
Tags:    

Similar News