తీన్మార్ కు సత్తి గుడ్ బై?

Update: 2017-11-09 23:30 GMT
మొన్నటి వరకు వెండితెర నటీనటులనే బిగ్గెస్ట్ సెలబ్రెటీలు అనేవారు. కానీ ప్రస్తుతం బుల్లితెర నటీనటులు కూడా మంచి ఇమేజ్ ను సంపాదించుకుంటున్నారు. ఇకపోతే ప్రముఖ తెలంగాణ వి6 ఛానెల్ లో తీన్మార్ వార్తలు అనే షో ద్వారా కేవలం 5 నిమిషాలు తనదైన శైలిలో వార్తలు చెప్పి ఆకట్టుకునే సత్తి గురించి అందరికి తెలిసిందే. అయితే అతను నిన్న షో లో కనిపించలేదు.

అందుకు గల కారణం కరెక్ట్ గా ఇంకా తెలియరాలేదు గాని సత్తి మాత్రం షో నుంచి తప్పుకున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాల్లో కూడా చాలా వైరల్ అవుతోంది. సత్తి అసలు పేరు రవి. రంగారెడ్డి చేవెళ్ల ప్రాంతానికి చెందిన రవి మొదట సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఎక్కడా అనుకున్నంతగా అవకాశాలు లభించలేదు. అనుకోకుండా v6 తీన్మార్ లో ఛాన్స్ రావడంతో బాగా క్లిక్ అయ్యాడు. అయితే మొన్నటి వరకు బాగానే ఉన్న సత్తి రీసెంట్ గా యాజమాన్యంతో విభేదాలు రావడంతో పూర్తిగా తప్పుకున్నట్లు ఓ సైడ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. సత్తి వెళ్లిపోవడానికి గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదు.

కానీ అతనికి అవకాశాలు ఎక్కువవుతుండడంతో రాజీనామా చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉదయభానుతో ఓ టివి షోకి వ్యాఖ్యాతగా చేయడానికి రెడీగా ఉన్నాడు. షో నిర్వాహకులు రెండు లక్షల పారితోషికం కూడా అఫర్ చేసినట్లు టాక్. 
Tags:    

Similar News