ఫొటో టాక్: వాణీ వయ్యారాలను వర్ణించతరమా?

Update: 2023-01-19 10:34 GMT
బాలీవుడ్ బ్యూటీస్ సినిమాలలో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా అందాల ప్రదర్శన చేస్తూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు అనే సంగతి అందరికి తెలిసిందే. ఓ విధంగా చెప్పాలంటే సెలబ్రిటీలకి ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మంచి ఆధార మార్గం. ఈ ఆదాయం రెట్టింపు చేసుకోవడం కోసం తమ అందాలని ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలని రెచ్చగొడుతూ ఉంటారు. దీనికి ఎవరూ అతీతం కాదని చెప్పాలి.

బాలీవుడ్ లో చాలా మంది భామలు ఇన్స్టాగ్రామ్ ద్వారా కోట్లాది రూపాయిలు సంపాదిస్తున్నారు. వారికి సినిమా ద్వారా వచ్చే రెమ్యునరేషన్ కంటే ఎక్కువగా కూడా సోషల్ మీడియా ద్వారా సంపాదించే సెలబ్రిటీలు ఉన్నారు. ఈ కారణంగా వారి హాట్ ఫోటోలని ఇన్స్టావేదికగా షేర్ చేయడం. అవి కాస్తా వైరల్ కావడం జరుగుతుంది.

తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణీ కపూర్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ బ్యూటీ బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తుంది. సౌత్ లో చివరిగా ఆహా కల్యాణం అనే సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో తెలుగు దర్శకులు ఎవరూ కూడా వాణీ కపూర్ వైపు చూడలేదు. గత ఏడాది షంషేర్ అనే సినిమాతో రణబీర్ కపూర్ కి జోడీగా వాణీ కపూర్ నటించింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ప్రస్తుతం ఆమె చేతిలో సినిమాలు అయితే ఏవీ లేవు. అయితే ఫోటోషూట్ లకి మాత్రం కొదవలేదు. తాజాగా లైట్ ఎల్లో కలర్ డ్రెస్సులో వీపుపై ఎలాంటి అచ్చాదనం లేకుండా  హొయలు పోతూ కనిపించింది. ఈ ఫోటో పెట్టిన మూడు గంటల్లోనే ఏకంగా 60 వేల మందికి పైగా వీక్షించారు. దీనిని బట్టి ఆమె ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంది ఆసక్తిగా చూస్తారో అర్ధం చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో వాణీ కపూర్ కి ఏకంగా 6.5 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News