స్వదేశీ టీకా దేశానికి గ‌ర్వ‌కార‌ణం - బాల‌కృష్ణ

Update: 2021-01-26 12:50 GMT
స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్ర‌జ‌లు పాటుప‌డాల‌ని ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ కోరారు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని హైద‌రాబాద్ లోని బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రిలో ఆయన జాతీయ జెండాను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. మ‌న టీకా విదేశాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌డం ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు. క‌రోనా కాలంలో కూడా వైద్యులు ఎంతో అంకిత భావంతో సేవ‌లు అందించార‌ని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా సాగుతోందని అన్నారు.

బసవతారకంలోనూ వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. గ్రహణ మొర్రి బాధిత చిన్నారులు 3,200 మందికి ఉచితంగా చికిత్స చేసినట్లు బాలకృష్ణ వెల్లడించారు. సేవభావంతో కాన్సర్ రోగులకోసం ఎన్టీఆర్ ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా కరోనాతో పోరాడి అసువులు బాసిన వారికి బాలయ్య నివాళులు అర్పించారు.
Tags:    

Similar News