దసరా సీజన్ కు ఆర్ ఆర్ ఆర్ సినిమా రాదని దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఒకటి రెండు రోజుల్లోనే ఆ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ మారుతున్న నేపథ్యంలో దసరాకు చిరంజీవి నటిస్తున్న ఆచార్య మరియు బాలయ్య నటిస్తున్న అఖండ సినిమాలు ఒకటి రెండు రోజుల తేడాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అంతా భావించారు. కాని ఆచార్య సినిమా ఇప్పట్లో వచ్చే దాఖలాలు కనిపించడం లేదు. సినిమా కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు కాని మంచి టైమ్ ను చూసి విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
దసరాకు ఆచార్య దాదాపుగా లేనట్లే అని మెగా కాంపౌండ్ నుండి విశ్వసనీయ సమాచారం అందుతోంది. దాంతో దసరకు అఖండ మాత్రమే బరిలోకి దిగబోతున్నాడు అనుకుంటున్న సమయంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా కొండ పొలం విడుదలకు సిద్దం అయ్యింది. దసరాకు కాస్త ముందు ఈ సినిమాను బరిలోకి దించబోతున్నారు. కాస్త అటు ఇటుగా ఈ సినిమా దసరా సందర్బంగానే రాబోతున్నట్లుగా అనుకోవాలి. చిరంజీవి ఆచార్య తో దసరా కు అభిమానుల ముందుకు వస్తాడు అనుకుంటే క్రిష్ దర్శకత్వంలో చేసిన కొండ పొలం సినిమాతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆలస్యం విషయం అధికారికంగా ప్రకటన వచ్చిన తర్వాత మరి కొన్ని సినిమాలు కూడా దసరా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఆచార్య సినిమా కాకుండా మెగా ఫ్యామిలీ నుండి కొండ పొలం మాత్రమే దసరా సీజన్ లో నిలువబోతుంది. అఖండ సినిమా విడుదల తేదీ విషయంలో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొండ పొలం కు కాస్త అటు ఇటుగానే అఖండ సినిమా విడుదల తేదీ ఉంటుందనే అభిప్రాయంను మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
అఖండ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో దసరాకు విడుదల చేస్తే ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. బాలయ్య మరియు బోయపాటి కాంబో మూవీ అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నారు. ఇక ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత క్రిష్ వంటి మంచి దర్శకుడి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ చేసిన సినిమా అవ్వడం వల్ల కొండ పొలం ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈ రెండు సినిమాలు కూడా దసరా సీజన్ లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడే అవకాశాలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు.
రాజమౌళి తన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల తేదీ విషయంలో వారం రోజుల్లో స్పష్టత ఇస్తే మరిన్ని సినిమాలు దసరా సీజన్ కు రెడీ అవుతాయి. మరి వాటితో ఈ రెండు సినిమాలు ఎలా పోటీ పడుతాయి అనేది కూడా చూడాలి. గతంలో పలు సందర్బాల్లో చిరంజీవి మరియు బాలయ్య లు పోటీ పడ్డారు. అయితే ఈ సారి మాత్రం దసరా సీజన్ లో చిరు మేనల్లుడు మరియు బాలయ్య పోటీ కి సిద్దం అవుతున్న నేపథ్యంలో మరో సారి మెగా మరియు నందమూరి అభిమానుల మద్య తీవ్రమైన ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది.