మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్ పై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో కృతీ శెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతోంది. ఇక 'ఉప్పెన' సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా.. 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు రెండు లిరికల్ పాటలు విడుదల కాగా అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా ఈ సినిమాని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసారు. దానికి తగ్గట్లే షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకోగా కరోనా వచ్చి ప్లాన్స్ అన్నీ తారుమారు చేసింది.
ఈ నేపథ్యంలో 'ఉప్పెన' సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య అన్ని ఇండస్ట్రీల ప్రొడ్యూసర్స్ థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశం లేదని భావించి తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కాగా లేటెస్టుగా 'కృష్ణ అండ్ హిజ్ లీల' మరియు 'భానుమతి అండ్ రామకృష్ణ' సినిమాలు విడుదలయ్యాయి. ఇక పరిస్థితులు ఇప్పుడప్పుడే అనుకూలించేలా కనపడకపోవడంతో 'ఉప్పెన'ని కూడా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేస్తారు అని అనుకున్నారు.
అయితే ఈ సినిమా మేకర్స్ థియేటర్స్ రీ ఓపెన్ అయ్యే దాకా వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యారట. దీనికి కారణం ఓటీటీలు ఆఫర్ చేసే అమౌంట్ నచ్చకనే అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. డెబ్యూ హీరో అయినప్పటికీ మెగా హీరో కావడంతో 'ఉప్పెన' కోసం సుమారు 20 కోట్లు ఖర్చు చేశారట. అయితే ఈ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ డెబ్యూ హీరో సినిమాకి ఆ రేంజ్ లో డబ్బు పెట్టి కొనడానికి ముందుకు రావడం లేదట. దీంతో 'ఉప్పెన' టీమ్ కి థియేటర్స్ రీ ఓపెన్ చేసే దాకా వేచి చూడటం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయిందట. ఇదే కనుక నిజమైతే థియేటర్స్ లో వచ్చే ఫస్ట్ సినిమా ఇదే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు.