కమెడియన్ గా మంచి డిమాండ్ ఉన్న సప్తగిరి ఈమధ్య హీరో అవతారం ఎత్తి ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అదే కోవలో 'వజ్ర కవచధర గోవింద' అనే ఫుల్ వైబ్రేషన్స్ ఉండే టైటిల్ తో మనముందుకు రానున్నాడు. ఈరోజే ఈ సినిమా టీజర్ విడుదలైంది. 51 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్లో సప్తగిరి తనను తాను మరోసారి యాక్షన్ హీరోగానే ప్రొజెక్ట్ చేసుకున్నాడు.
"నేనో వలస పక్షిని.. నాకంటూ ఓ గమ్యం లేదు. నన్ను వెతుక్కుంటూ ఓ నలుగురొచ్చారు.. స్నేహితులన్నారు. ఓ అందమైన అమ్మాయి వచ్చింది.. ప్రియురాలంది.." ఇలా మొదలు పెట్టి ఓ పొడవైన డైలాగ్ తో తనను తాను పరిచయం చేసుకున్నాడు సప్తగిరి. ఈ పొడవాటి డైలాగ్ చివరలో 'నా ధైర్యం.. నా ఆయుధం సంకల్ప బలం" అన్నాడు. అలా అనే సమయంలో ఒక సాన పెడుతున్న కత్తిమొన నుండి వచ్చే నిప్పుతో బీడీ వెలిగించి.. రజనీకాంత్ స్టైల్ లో అటుఇటూ తిప్పి కత్తులను సానబెట్టే మనిషి నోట్లో ఆ బీడీని పెట్టాడు!
నెక్స్ట్ షాట్ లో కత్తులను సాన పెట్టే సమయంలో వచ్చే నిప్పురవ్వలను కుళాయి నుండి వచ్చే నీళ్ళను దోసిళ్ళతో పట్టుకుని తాగినట్టుగా కింద కూర్చుని తాగాడు. "అదిరిపోయింది టేస్టు" అంటూ ఒక డైలాగ్ చెప్పాడు. టీజర్ ను చూస్తుంటే బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలన్నీ మిక్సీలో వేసి దానికి 'సప్తగిరిజం' దట్టించినట్టు అనిపిస్తోంది. ఈ రొటీన్ ఫార్మాట్ సీమ ఫ్యాక్షన్ మసాలాలో సప్తగిరిని చూస్తారా లేదా అనేది సందేహమే. ఎదైతేనేం.. ఈ ఫ్యాక్షన్ సప్తగిరిని ఒకసారి చూసి తరించండి. అన్నట్టు ఈ టీజర్లో ఒక చిన్న షాట్ ఉంది.. కటికచీకటిలో ఒక పేద్ద చింత చెట్టెక్కి విక్రమార్కుడిలా నిలబడ్డాడు.. పక్కన బేతాళుడు మాత్రంలేడు. మరి ఈ ఫ్యాక్షన్ సినిమాలో థ్రిల్లర్ యాంగిల్ కూడా ఉందేమో గానీ ఆ షాట్ ను కూడా కాస్త గమనించండి బాబులు..!
Full View