తెలుగు రాష్ట్రాలు మొత్తం వకీల్ సాబ్ ఫీవర్ తో ఊగిపోతున్నాయి అనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున వకీల్ సాబ్ ను విడుదల చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా వకీల్ సాబ్ సందడి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షో లను వేసేందుకు అనుమతులు తీసుకున్నాడు దిల్ రాజు. కాని చివరి నిమిషంలో ఏపీలో బెనిఫిట్ షో లకు అనుమతులు రద్దు చేశారు. కరోనా కారణంగా బెనిఫిట్ షో లు వేయడం సబబు కాదంటూ ప్రభుత్వ వర్గాల వారు అనుమతులు ఇవ్వలేదు. దాంతో ఏపీలో ఆలస్యంగా వకీల్ సాబ్ బొమ్మ పడింది. తెలంగాణలో మాత్రం ముందుగా అనుకున్నట్లుగా వకీల్ సాబ్ బెనిఫిట్ షో లు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్ల వద్ద సందడి వాతావరణం కనిపించింది.
తెలంగాణలో బెనిఫిట్ షో ల టికెట్ల రేట్లు 1500 రూపాయలు పలికినట్లుగా చెబుతున్నారు. ఇక వకీల్ సాబ్ సినిమా సందడి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. ఏపీలో ఎక్కడ కూడా బెనిఫిట్ షో లు వేయకుండా పోలీసులు థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల టికెట్లు అమ్మి బెనిఫిట్ షో వేయక పోవడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. థియేటర్ల వద్ద ఆందోళనకు దిగారు. కొన్ని థియేటర్లపై రాళ్లు రువ్వారు. నైజాంలో తెల్లవారు జామునే వకీల్ సాబ్ సందడి మొదలు అవ్వగా ఏపీలో మాత్రం కాస్త ఆలస్యంగా సందడి వాతావరణం కనిపిస్తుంది. మొత్తంగా ప్రస్తుతం ఏపీ మరియు తెలంగాణలో వకీల్ సాబ్ సందడి షురూ అయితే అయ్యింది. ఇక వసూళ్లు ఎలా ఉన్నాయి అనేది మరి కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.