పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందికి కరోనా సోకడంతో ఆయన గృహనిర్భంధంలోకి వెళ్లారని వస్తున్న వార్తలు ఓవైపు.. వకీల్ సాబ్ వసూళ్ల ప్రభంజనానికి సంబంధించిన వార్తలు మరోవైపు సంచలనంగా మారాయి.
రిలీజ్ ముందు కోర్టు ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వ చర్యలపై ఎంతో చర్చ సాగింది. ఇప్పుడు రిలీజ్ అనంతరం కూడా వకీల్ సాబ్ గురించి అంతే ఇదిగా ముచ్చటించుకుంటున్నారు. ముఖ్యంగా కోర్టుల జోక్యంతో వకీల్ సాబ్ టికెట్ రేటు పెంపునకు చెక్ పడింది. అయినా పవన్ మానియా బాక్సాఫీస్ విండో వద్ద ఏమాత్రం తగ్గడం లేదన్న నివేదన తాజాగా అందింది.
ఓవైపు కరోనా భయాలు ఉన్నా జనం థియేటర్ల వైపు పోటెత్తుతుండడంతో కలెక్షన్ల సునామీ కొనసాగుతోందని తాజాగా రిపోర్ట్ అందింది. ఈ సినిమా తొలి రోజు ఏకంగా 33కోట్ల షేర్ వసూలు చేసి రికార్డులు బ్రేక్ చేసింది. నాన్ బాహుబలి సినిమాల్లో సైరా-సాహో తర్వాతి స్థానంలో నిలిచిందని రిపోర్ట్ అందింది. ఇక ప్రస్తుతం కోర్టు తీర్పుతో సాధారణ టికెట్ ధరలతోనే వకీల్ సాబ్ ని ఆడించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా వకీల్ సాబ్ రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను సాధిస్తోందని రిపోర్ట్ అందింది. సాధారణ ప్రేక్షకులు ఏదీ పట్టించుకోవడం లేదు. టికెట్ ధరలపై వివాదం COVID-19 కేసుల పెరుగుదల ఉన్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండో రోజు కూడా లెక్కల పరంగా స్థిరంగా ఉంది. ఏపీ తెలంగాణలో వసూళ్లు బావున్నాయని రిపోర్ట్ అందింది. ఈ చిత్రం ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అతిపెద్ద బ్లాక్ బస్టర్ ల తరహాలో హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లను సాధిస్తోంది.
మూడవ రోజు ప్రోత్సాహకరంగా వసూళ్లను కలిగి ఉంది. ముఖ్యంగా ఈ చిత్రం ద్వితీయార్థాన్ని ప్రశంసిస్తూ విమర్శకులు ఏకగ్రీవంగా సానుకూల సమీక్షలు ఇవ్వడంతో అంతకంతకు కలెక్షన్లు పెరిగేందుకు ఇది సాయమవుతోంది. ఇప్పటికే చిరంజీవి.. రామ్ చరణ్.. మహేష్ సహా ఇండస్ట్రీ ప్రముఖులంతా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ ఫామ్ కొనసాగుతోందని మహేష్ వ్యాఖ్యానించడం ఉత్కంఠ రేపింది.
నిర్మాత దిల్ రాజు పట్టుబట్టడంతో పంపిణీదారులు కలెక్షన్లను వెల్లడించడం లేదు. రకరకాల రాజకీయాల గురించి పవన్ అభిమానులు ఫైరైనా నిర్మాత దిల్ రాజు స్థబ్ధుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో సాధారణ టికెట్ ధరలతోనే ఎలాంటి పెంపు లేకుడా ప్రదర్శితమవుతోంది.