#వ‌కీల్ సాబ్‌.. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో రికార్డ్?

Update: 2021-04-11 04:55 GMT
ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ల్యాణ్ మానియా బాక్సాఫీస్ వ‌ద్ద కొన‌సాగుతోంది. దాదాపు మూడేళ్ల గ్యాప్ త‌ర్వాత ప‌వ‌న్ కంబ్యాక్ ఓ రేంజులో ఉంద‌న్న టాక్ ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వకీల్ సాబ్ ‌బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

తాజా స‌మాచారం మేర‌కు .. భారతీయ చిత్ర పరిశ్రమలో కరోనా అనంతర రికవరీ దశలో అత్యుత్తమ ఓపెనింగ్ డే రికార్డ్ న‌మోదైంద‌ని తెలిసింది. బాహుబ‌లి- 2.. బాహుబ‌లి-1 త‌ర్వాత మూడ‌వ ఉత్త‌మ ఓపెన‌ర్ గా వ‌కీల్ సాబ్ రికార్డుల్లో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా- డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన సాహో త‌ర్వాత వ‌కీల్ సాబ్ నాన్ బాహుబ‌లి రికార్డుల్లో మూడో స్థానంలో నిలిచింది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా కంటెంట్ గొప్ప‌గా న‌చ్చేస్తోంది. కోర్ట్ డ్రామా ఎమోష‌న్స్ నేప‌థ్యంలో సినిమా ర‌క్తి క‌ట్టించింద‌న్న టాక్ సామాన్య ప్ర‌జ‌ల్లో వినిపిస్తోంది.

వకీల్ సాబ్ ప్రారంభ రోజు 33 కోట్ల వ‌ర‌కూ షేర్ ద‌క్కింద‌ని తెలిసింది. వ‌కీల్ సాబ్ రిలీజ్ ముందు మెలోడ్రామా.. టికెట్ రేట్ల విష‌యంలో సందిగ్ధ‌త వ‌గైరా ఏవీ బాక్సాఫీస్ రికార్డుల్ని ఆప‌లేదన్న చ‌ర్చ సాగుతోంది. నిజానికి స‌వ్య‌మైన రిలీజ్ ఉంటే ఈ సంఖ్య ఇంకాస్త పెద్ద‌గా ఉండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది.

ఆస‌క్తిక‌ర విష‌యం ఏమంటే.. సైరా- సాహో- బాహుబ‌లి లాంటి చిత్రాలు ఎలాంటి అవాంత‌రాలు లేకుండా తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ రిలీజ‌య్యాయి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల మద్దతుతో ప‌ని లేకుండానే వ‌కీల్ సాబ్ ఇంత పెద్ద మొత్తం వ‌సూలు చేసింది. ఒక‌వేళ అన్నిచోట్లా స‌జావుగా రిలీజ్ సాగి ఉంటే క‌చ్ఛితంగా ఈ చిత్రం యాభై కోట్ల మేర‌ వ‌సూలు చేసేద‌న్న చ‌ర్చా సాగుతోంది.  వ‌కీల్ సాబ్ బ్రేక్ ఈవెన్ సాధించ‌డం పెద్ద క‌ష్టం కాద‌న్న అభిప్రాయం ట్రేడ్ లో నెల‌కొంది.
Tags:    

Similar News