పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ ఇటీవల విడుదల అయ్యింది. సినిమాకు అభిమానులతో పాటు అందరి నుండి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి రెండు మూడు రోజులు భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇక వీక్ మొదలు అయిన నేపథ్యంలో సామాన్య ప్రేక్షకులు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను చూడాల్సి ఉంటుంది. వారు థియేటర్ కు రావడాన్ని బట్టి సినిమా వసూళ్లు అనేవి ఆధారపడి ఉంటాయి. ఇటీవల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు వెళ్లకుండా ఎక్కువగా ఓటీటీ కంటెంట్ పై ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో వకీల్ సాబ్ సినిమా కూడా ఓటీటీలో వచ్చేస్తుందేమో అంటూ వారు ఎదురు చూస్తున్నారు. ఓటీటీలో సినిమా ను చూడటం వల్ల ఒక ఫ్యామిలీకి కనీసం వెయ్యి అయినా మిగులుతుంది. అందుకే వకీల్ సాబ్ ఓటీటీ రిలీజ్ అంటూ పుకార్లు ప్రారంభం అయ్యాయి.
వకీల్ సాబ్ సినిమాను ఓటీటీలో చూసేందుకు గాను చాలా మంది వెయిట్ చేస్తున్నారని.. కరోనా సెకండ్ వేవ్ కనుక వెంటనే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు దిల్ రాజు చర్చలు జరుపుతున్నట్లుగా పుకార్లు షికార్లు చేశాయి. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు మరీ ఎక్కువ అయ్యాయి. దాంతో థియేటర్ కు వెళ్లాలనే ఆలోచన ఉన్న వారు కూడా ఓటీటీ లో వస్తుంది కదా వెయిట్ చేద్దాం అనే ఆలోచనకు వచ్చేస్తున్నారని వెంటనే గ్రహించిన చిత్ర యూనిట్ సభ్యులు స్పందించారు. సినిమాను ఓటీటీలో విడుదల చేసే ఉద్దేశ్యం లేదు అంటూ స్ట్రాంగ్ ఆ వార్తలపై రిప్లై ఇచ్చారు.
చిత్ర యూనిట్ సభ్యులు ఏకంగా ఒక పోస్టర్ ను విడుదల చేసి సినిమాను ఓటీటీలో విడుదల చేయడం లేదు. కేవలం సినిమాను మీరు థియేటర్లలోనే చూడాలంటూ ఆ పోస్టర్ లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి ఓటీటీ లో ఈ సినిమాను ఇప్పట్లో విడుదల చేయడం లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా చూడాలి. ఈ సినిమా కు ఉగాది సెలవు కూడా కలిసి వచ్చింది. కనుక వసూళ్లు మరింతగా వస్తాయని ఆశిస్తున్నారు. ఓటీటీ లో వకీల్ సాబ్ వస్తుందని ఎదురు చూడకుండా థియేటర్లకు వచ్చేసి చూడండి అంటూ చిత్ర బృందం విజ్ఞప్తి చేస్తోంది.