విక్టరీ వెంకటేష్ కథల ఎంపిక సంథింగ్ డిఫరెంట్. అప్పటికే ప్రూవ్ చేసిన కథాంశం అయితే సేఫ్ సైడ్ అని భావిస్తుంటాడు. అందుకే అతడి కెరీర్‌లో ఎక్కువగా రీమేక్ సినిమాలు తెరకెక్కాయి. అయితే ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో యువదర్శకుల వెల్లవ వల్ల కథలు పెరిగాయి. అవి వినేందుకు స్కోప్ కూడా పెరిగింది. విక్టరీ వెంకటేష్ చుట్టూ ప్రస్తుతం ఓ నలుగురైదుగురు దర్శకరచయితలు తిరుగుతున్నారు.
అయితే వీళ్లలో ఎవరిని ముందుగా అవకాశం వరిస్తుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇటీవలి కాలంలో మారుతి - క్రాంతిమాధవ్ వినిపించిన కథలు నచ్చాయి .. కానీ ఇంకా ఓకే చెప్పేయలేదని వార్తలొచ్చాయి. అయితే ఈలోగానే మరో వార్త టాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. స్టార్ రైటర్ వక్కంతం వంశీ విక్టరీ వెంకటేష్ ని కలిసి ఓ కాప్ స్టోరీ వినిపించాడు. అది వెంకీకి పిచ్చిగా నచ్చేసింది. వక్కంతం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారని అన్నారు. అయితే ఇదే విషయాన్ని వక్కంతంనే ప్రశ్నిస్తే .. ఛాన్సే లేదు. నా మొదటి సినిమా ఎన్టీఆర్‌తో తప్ప వేరే ఎవరితోనూ చేయను అని చెప్పాడు. అంటే ఈ కాప్ స్టోరీని డైరెక్ట్ చేయడానికి గోపాల గోపాల ఫేం డాలీ ఒక్కడే ఉన్నాడేమో.
వెంకీకి కాప్ స్టోరీ బాగానే ఉంటుంది. డాలీ దర్శకుడు అయితే నెగ్గుకొచ్చేస్తాడనే అనిపిస్తోంది. అప్పట్లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఘర్షణ చిత్రంలో పోలీస్ క్యారెక్టర్ లో అదరగొట్టేశాడు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ఎటెంప్ట్ లేదు. కాని డాలీ ప్రస్తుతం పవన్ హీరోగా, దాసరి నిర్మించే సినిమాకి కథా చర్చల్లో పాల్గొంటున్నాడు. చూద్దాం మరి ఏమవుతుందో...