SSMB29: మెహర్ రమేష్ కు ఇష్టమైన పేరుతో.. మహేష్ రోల్?

ఇప్పటికే SSMB29 గురించి అఫీషియల్ అప్డేట్స్ తక్కువగా ఉన్నప్పటికీ, లీకులు మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి.;

Update: 2025-03-07 05:15 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్. ఇప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా అతి పెద్ద ప్రాజెక్ట్‌గా హైప్ క్రియేట్ చేసింది. RRR లాంటి ప్రపంచస్థాయి విజయాన్ని అందుకున్న రాజమౌళి, ఇప్పుడు అంతకంటే పెద్దదాన్ని ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇది ఏకంగా పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ వచ్చింది. అయితే, చిత్రంలోని మహేష్ బాబు పాత్రకు మెహర్ రమేష్ కు ఇష్టమైన పేరు పెట్టినట్లు తాజా టాక్ హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే SSMB29 గురించి అఫీషియల్ అప్డేట్స్ తక్కువగా ఉన్నప్పటికీ, లీకులు మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. ఇటీవల హీరో క్యారెక్టర్ డీటైల్స్, విలన్ రోల్, ప్రియాంక చోప్రా హీరోయిన్ అనేది ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి. తాజాగా, సినిమాలో మహేష్ పాత్రను ‘రుద్ర’ అనే పేరుతో డిజైన్ చేశారని టాలీవుడ్ వర్గాల్లో టాక్. ఈ లీక్స్ నిజమా, ఫేకా అనే విషయం ఇప్పుడే చెప్పలేం. కానీ రాజమౌళి సినిమాలకు మామూలుగా క్యారెక్టర్ పేర్లు ఉండవు. పేరు వెనక బలమైన కథనం ఉంటుందని గత చిత్రాలు చూస్తే అర్థమవుతుంది.

ఇందులో మహేష్ బాబు ఓ అడ్వెంచరస్ రోల్ చేయబోతున్నారని తెలుస్తోంది. చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాల్లో షూటింగ్ జరపాలని చూస్తున్నారట. ఇండియాలో ఒడిశా, కేరళ లాంటి ప్రదేశాల్లో అలాగే ఆఫ్రికాలో లొకేషన్లలో షూటింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహేష్ ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇది పూర్తి భిన్నంగా ఉండబోతుందన్న హింట్ ఇప్పటికే ఫ్యాన్స్ కు వచ్చింది. కానీ ‘రుద్ర’ అనే పేరు వింటూనే కొన్ని సినిమాలు గుర్తొచ్చి వెనకబడి ట్రోల్ కూడా స్టార్ట్ అయింది.

2011లో ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా విషయాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో దర్శకుడు మెహర్ రమేష్ ఎన్టీఆర్ పాత్రను రివీల్ చేస్తూ, “ఇదిగో.. రుద్ర!” అంటూ పోస్టర్ రిలీజ్ చేయడం అప్పట్లో హైప్ తీసుకొచ్చినా, సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో ఆ పేరు ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిపోయింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో "రుద్ర" అంటే శక్తి సినిమానే గుర్తొస్తుంది. ఇప్పుడు రాజమౌళి అదే పేరును మహేష్ పాత్రకు ఉపయోగించాడనే వార్త వైరల్ అవుతుండటంతో ఈ అంశంపై పెద్ద చర్చ మొదలైంది.

కానీ, రాజమౌళి ఏం చేసినా దాని వెనుక ఒక బలమైన లాజిక్, కథనం ఉంటుంది. RRR లో భీమ్, రామ్ పాత్రల పేర్లు ఎలా క్యారెక్టర్‌లను ఎలివేట్ చేశాయో మనం చూసాం. అదే విధంగా మహేష్ పాత్రలో ఏదో ఒక బ్యాక్‌స్టోరీ ఉండొచ్చని అనుకోవాలి. ఏదైనా మైథలాజికల్ కాన్సెప్ట్ లేదా ఒక సింబాలిక్ మెసేజ్ ఈ పేరుకు ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. మహేష్ కెరీర్‌లో ఇది పూర్తిగా కొత్త పంథాలో ఉండే పాత్ర అవుతుందని చెప్పడం గమనార్హం.

SSMB29 బడ్జెట్ పరంగా ఎక్కడా రాజీ పడట్లేదు. ఈ సినిమాకు దాదాపు 1000 కోట్ల పైగా ఖర్చు అవుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఇది బాహుబలి, RRR లను దాటిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పాన్ వరల్డ్ మూవీగా విడుదల చేయాలని రాజమౌళి టార్గెట్ చేసుకున్నాడు. ఆ స్థాయిలో ప్రొడక్షన్ వాల్యూస్‌తో, కొత్త తరహా కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా, కేవలం ఇండియా వరకే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కించనుంది. అయితే ‘రుద్ర’ అనే పేరుకు ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Tags:    

Similar News