అజిత్ కొంతకాలంగా వరుస హిట్లను అందుకుంటూ వస్తున్నాడు. ఈ సారి ఆయన నుంచి వస్తున్న 'వలిమై' కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి హెచ్. వినోత్ దర్శకత్వం వహించాడు. ఎమోషన్ తో కూడా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ కథ నడవనుంది. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ అంచనాలు పెంచుతూ వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు.
అయితే ఆ సమయంలో కరోనా తీవ్రత పెరుగుతూ ఉండటంతో .. థియేటర్లను మూసేస్తూ ఉండటంతో విడుదల తేదీని వాయిదా వేశారు. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారుతూ ఉండటంతో, వెనక్కి తగ్గిన సినిమాలన్నీ మళ్లీ లైన్ మీదకి వస్తున్నాయి. అలాగే 'వలిమై' కూడా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఫిబ్రవరి 24వ తేదీన ఈ సినిమాను తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ రిలీజ్ డేట్ తో కూడిన ట్రైలర్ ను ఈ మూడు భాషల్లోను వదలనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చకచకా జరుగుతున్నాయి.
ఈ సినిమాలో అజిత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక విలన్ గా చేస్తున్న కార్తికేయ దోపిడీ ముఠా నాయకుడి పాత్రను పోషించాడు. విలన్ గ్యాంగ్ బైక్స్ పై ఛేజ్ చేస్తూ భారీ దొంగతనాలకు పాల్పడుతుంటారు. వాళ్లని పట్టుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక సవాలుగా మారుతుంది. అప్పుడు పోలీస్ ఆఫీసర్ గా అజిత్ రంగంలోకి దిగుతాడు. దోపిడీ ముఠాను పట్టుకోవడానికి అజిత్ ఎలాంటి ప్లాన్ వేస్తాడు? విలన్ గ్యాంగ్ కి నుంచి ఆయనకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
అజిత్ సరసన నాయికగా హుమా ఖురేషి నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను గిబ్రాన్ అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు. కార్తికేయ తెలుగులో హీరోగా నిలదొక్కుకుంటూనే ఈ సినిమాలో విలన్ గా చేయడం విశేషం. ఇప్పటికే ఆయన లుక్ కి మంచి మార్కులు పడిపోయాయి. ఈ సినిమా హిట్ అయితే ఈ తరహా పాత్రలతో ఆయన అక్కడ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా మరో సంచలనానికి తెరతీయడం ఖాయమనేది అభిమానుల మాట.