దొంగా పోలీస్ ఛేజ్ లు గేమ్ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. దొరికినట్టే దొరికి చేజారిపోయే దొంగ కథతోనే ధూమ్ సిరీస్ ని రన్ చేసారు. పోలీస్ తో దొంగ ఆడే గేమ్ మరో లెవల్లో ఉంటుంది. మేధావులకు మస్కా వేసే అపరమేధోతనంతో దొంగ దొరక్కుండా తప్పించుకునే కాన్సెప్టుతోనే స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంతకుముందు జెంటిల్ మేన్ సినిమాని తెరకెక్కించారు. ఇవన్నీ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. ఇప్పుడు అలాంటి కాన్సెప్టుతోనే మరో సినిమా వస్తోంది. అది `వలీమై`. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది.
తళా అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ దొంగ గా నటించాడు. అజిత్ ఛామ్ ని స్టైల్ ని ఎలివేట్ చేసిన ట్రైలర్ ఇది. కార్తికేయ రేసింగ్ ఎబిలిటీని హై ఎనర్జీని ఈ సినిమాలో చూపించినంతగా ఇంకెక్కడా చూపించరేమో అన్నంతగా కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజైన వలీమై ట్రైలర్ ఆద్యంతం కళ్లు తిప్పుకోనివ్వని ట్రీటిస్తోంది. దొంగను వెంటాడే పోలీస్ గా అజిత్ కనిపిస్తుంటే.. వైట్ కాలర్ నేరగాడిగా డేర్ డెవిల్ ఫీట్స్ తో అడ్వెంచర్స్ తో దొంగతనాలు చేస్తూ పోలీసులను మట్టి కరిపించే నేర్పరిగా కార్తికేయ కనిపిస్తున్నాడు. కార్తికేయ అండ్ గ్యాంగ్ అరాచకాలు రోబరీలను ఒక లెవల్లో ఈ సినిమాలో చూస్తున్నారని ట్రైలర్ చెబుతోంది.
ట్రైలర్ ఎంతో గ్రిప్పింగ్ గా సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మోడ్ లో ఆకట్టుకుంది. ఇక సినిమా ఆద్యంతం ఇదే టింజ్ ఉంటే ధూమ్ తరహాలో బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయంగా కనిస్తోంది. ఇది పక్కా పాన్ ఇండియా కంటెంట్ తో షేక్ చేయబోతున్న సినిమా అని అర్థమవుతోంది. ట్రైలర్ లో గగుర్పొడిచే బైక్ ఛేజ్ లు కార్ ఛేజ్ లకు కొదవేమీ లేదు. గేమ్ అయిపోలేదు.. నెక్ట్స్ లెవల్ కి వెళ్లబోతోంది! అంటూ కార్తికేయ డైలాగ్ తో కొనసాగింపు పార్ట్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చేశారు. మొత్తానికి వలీమై అదిరే ట్రీట్ ఇవ్వబోతోందని అర్థమవుతోంది. హెచ్ వినోద్ దర్శక్వం వహించిన ఈ చిత్రానికి దాదాపు 160 కోట్ల బడ్జెట్ ఖర్చయింది. బోనీకపూర్ తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్స్ - జీ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఫిబ్రవరి 24న ఈ చిత్రం విడుదలవుతోంది.
Full View