క్రిష్ణ వంశీ వందేమాతరం హీరో ఆయనేనా... ?

Update: 2021-10-27 05:15 GMT
క్రిష్ణ వంశీ అంటేనే క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు. ఆయన తీసిన సినిమాలు ఆయన ఏంటో చెబుతాయి. రోటీన్ మూవీస్ రెగ్యులర్ ఫార్మేట్ లో తీయడు అన్న పేరు మాత్రం ఈ రోజుకీ ఉంది. హిట్టూ ఫట్టుతో సంబంధం లేకుండా క్రిష్ణ వంశీ తనదైన పంధాలో సాగుతున్నాడు. ఆయనకు నిజానికి సరైన హిట్ ఒకటి పడాల్సిన టైమ్ ఇది. అందుకే రంగ మార్తాండ అన్న మూవీని కసితో చేస్తున్నాడు. రిజల్ట్ గురించి ఎవరూ చెప్పలేకపోయినా క్రిష్ణ వంశీ తపన దీని వెనక ఉందని మాత్రం అంతా ఒప్పుకుంటారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో క్యారెక్టర్లను పరిచయం చేయడానికి వాయిస్ ఓవర్ ని మెగాస్టార్ చిరంజీవి ఇచ్చారు. ఒక విధంగా క్రిష్ణ వంశీకి మెగా బ్లెస్సింగ్స్ దక్కాయనే అనుకోవాలి. అపుడెపుడో క్రిష్ణ వంశీకి మెగాస్టార్ మాట ఇచ్చారట. దానికి గుర్తుపెట్టుకుని వచ్చి మరీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే గ్రేట్ చిరూ అనాల్సిందే.

దీంతోనే ఇక్కడ మరో విషయం మీద చర్చ సాగుతోంది. క్రిష్ణ వంశీ వందేమాతరం అన్న పేరుతో దేశ భక్తి చిత్రం తీయాలని చాలా కాలం క్రితమే అనుకున్నాడు. ఆ మూవీ కోసం చాలా రిసెర్చ్ కూడా చేశాడు. ఒక విధంగా క్రిష్ణ వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ అది. తాను ఎన్ని మంచి సినిమాలు చేసినా తన పేరు చెప్పగానే గుర్తుకువచ్చేలా వందేమాతరం ఉండాలన్నదే క్రిష్ణ వంశీ ఆలోచన. ఒక విధంగా ఆయన టోటల్ కెరీర్ కే అల్టిమేట్ మూవీ అన్నట్లుగానే డిజైన్ చేసుకున్నాడట. దాని కోసం మెగాస్టార్ చిరంజీవినే హీరో అనుకున్నాడు. అయితే ఎందుకో ఆ ప్రాజెక్ట్ మాత్రం ఈ రోజుకీ మెటీరియలైజ్ కాలేదు.

ఇపుడు చూస్తే క్రిష్ణ వంశీ అంటే విపరీతమైన ప్రేమతో వాయిస్ ఓవర్ కి తానే కోరి మరీ వచ్చిన మెగాస్టార్ ను చూసిన వారు అంతా ఈ ఇద్దరొ కాంబోలో మూవీ వస్తే బాగుండు అనుకుంటున్నారు. అది కూడా క్రిష్ణ వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ వందేమాతరం అయితే సూపర్ అని కూడా ఆలోచిస్తున్నారుట. క్రిష్ణ వంశీ తన సబ్జెక్ట్ కి సరైన హీరో మెగాస్టార్ అనే ఈ రోజుకీ అనుకుంటున్నాడు. మరి మెగాస్టార్ వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు. తనతో చేయాలనుకున్న వారందరికీ పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నాడు. ఇదే కరెక్ట్ టైమ్ క్రిష్ణ వంశీ కూడా కదిపితే కచ్చితంగా మెగా కాంబోలో ఈ ప్రాజెక్ట్ రావడం ఖాయమనే అంటున్నారు. అయితే దీనికంటే ముందు రంగమార్తాండ హిట్ కావాలి. అదే జరిగితే వందేమాతరం మూవీకి హీరో దొరికేసినట్లే. మెగాస్టార్ కూడా అపుడు ఓకే అన్నా అంటారు అని ప్రచారం సాగుతోంది. సో ఈ క్రేజీ కాంబో కోసం వెయిట్ చేయాల్సిందే.
Tags:    

Similar News