తన వివాదాస్పద తీరుతో నిత్యం వార్తల్లో ఉండే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై క్రిమినల్ కేసు నమోదైంది. వర్మ తాను తీసిన ‘వంగవీటి’ చిత్రంతో తమ కుటుంబ పరువు తీశాడంటూ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఈ కేసు పెట్టారు. తన తండ్రి దివంగత వంగవీటి రంగాను రౌడీగా చిత్రీకరిస్తూ వంగవీటి సినిమాను తీశారని.. దానివల్ల తమ కుటుంబ పరువుకు భంగం కలిగిందని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. ఆ సినిమా తీసే ముందు వర్మ వచ్చి తనను కలిశారని.. వంగవీటి రంగా ప్రతిష్ఠకు ఎలాంటి మచ్చ రాకుండా సినిమా తీస్తానంటూ ఇచ్చిన మాటను ఆయన తప్పాడని.. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమాను విడుదల చేశాడని రాధా మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడ క్రిమినల్ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
కాగా వంగవీటి సినిమా రిలీజ్ అయి చాలాకాలం దాటింది. వెంటనే దీనిపై ఏమీ స్పందించకుండా రాధా ఇప్పుడు రెస్పాండ్ కావడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. సినిమా విడుదలకు ముందు, రిలీజ్ తర్వాత వర్మ, దేవినేని నెహ్రూ, వంగవీటి రాధా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వర్మ కూడా దానిపై తీవ్రంగా స్పందించారు. అయినా, రాధా అప్పుడేమీ కేసు వేయలేదు. ఉన్నట్లుండి ఇప్పుడు కేసు వేయడంతో విషయం మరోసారి చర్చనీయమైంది.
రాధా గతంలో ఈ విషయంలో వర్మపై తీవ్ర స్థాయిలో మండిపడిన సందర్భాలున్నాయి. డబ్బు కావాలంటే ఇచ్చేవాడినని... అంతేకానీ, వంగవీటి జీవిత చరిత్రను ఇంతగా వక్రీకరించి సినిమా తీయడం కరెక్టు కాదని ఆయన అప్పట్లో అన్నారు. తాజాగా కేసు వేయడంతో ఆయన నెక్స్టు ఎలాంటి స్టెప్ వేస్తారా అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.