`ఆహా కళ్యాణం` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బ్యూటీ వాణీకపూర్. కానీ ఆ సినిమా డిజాస్టర్ ఫలితం తనను తీవ్రంగా నిరాశపరిచింది. బాలీవుడ్ లో మాత్రం వాణీ హవా సాగుతోంది. అక్కడ కొన్ని వరుస హిట్లతో తన పొజిషన్ ని ఇప్పుడు సుస్థిరం చేసుకుంది. యష్ రాజ్ సంస్థలో `శుధ్ దేశీ రొమాన్స్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ అటుపై `బేఫిక్రే`..`వార్` లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని ఉత్తరాది ప్రేక్షకులకు డీప్ గా చేరువైంది.
అయితే వాణీ కి సంబంధించిన ఓ సీక్రెట్ ఇప్పుడు ఓపెన్ కాగా అభిమానులు షాక్ కి గురవుతున్నారు. కపూర్ వంశస్తురాలిగా బాలీవుడ్ కి పరిచయమైనా ఈ అమ్మడికి కూడా అందరిలానే కష్టాలు ఒడిదుడుకులు ఉన్నాయి. 18-19 ఏళ్ల వయసులో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కున్నట్లు వాణీ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఒకానొక సమయంలో తన కుటుంబం డీప్ క్రైసిస్ ని ఎదుర్కొంది. ఆర్థిక కష్టాలతో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఆ క్రమంలోనే కుటుంబానికి అండగా నిలబడాలనే నిశ్చయంతో స్వయంగా కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకున్నానని వాణీ చెప్పుకొచ్చింది.
పరిస్థితులు మనిషిని ఎలాంటి ఫేజ్ లోకైనా నెట్టేస్తాయని.. వాటిని తట్టుకుని నిలబడినప్పుడు జీవితం ముందుకు సాగుతుందని.. కానీ అంత ధైర్యంగా ముందుకు వెళ్లాలంటే చాలా సంకల్పం ఉండాలని చెప్పుకొచ్చింది. సినిమా నటిగా ఎదిగే క్రమంలో తల్లిదండ్రుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంతా తానే స్వయంగా సమకూర్చుకుని నేడు ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపింది. మోడలింగ్ చేస్తున్న సమయం నుంచే ఇంటి దగ్గర నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉండేదని.. అందుకు కావాల్సిన ఖర్చులన్నింటినీ తానే స్వయంగా సంపాదించుకుని ఫ్యాషన్ తో మెడలింగ్ లోకి వచ్చినట్లు తెలిపింది.
ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా! పడిన కష్టాలు కెరీర్ ని ముందుకు తీసుకెళ్లడానికి భవిష్యత్ లో మళ్లీ ఆర్ధిక సమస్యలు ఎదురైనా నిలబడి తట్టుకునే ధైర్యాన్ని గత అనుభవాలు ఇచ్చాయని వాణీ కపూర్ తెలిపింది. మొత్తానికి వాణీకపూర్ కూడా సినిమా కష్టాలు ఎదుర్కొన్నట్లు వెల్లడించడం ఆసక్తికరం. ప్రస్తుతం వాణీ కపూర్ బాలీవుడ్ లో వరుసగా మూడు సినిమాలు చేస్తోంది. అక్షయ్ కుమార్ సరసన `బెల్ బాటమ్` లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే `షామ్ శ్రీ` అనే భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రంలోనూ నటిస్తోంది. అలాగే అభిషేక్ కపూర్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తోంది.
టాలీవుడ్ క్రేజీ మూవీ సలార్ లో ఆఫర్
వాణీ ఇప్పుడు టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. అది కూడా సలార్ లాంటి భారీ క్రేజీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `కేజీఎఫ్` దర్శకుడు ప్రశాంత్ నీల్ `సలార్` చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది. ప్రభాస్ కి విలన్ గా ఓ ప్రముఖ నటుడిని లాక్ అతడి వైఫ్ పాత్ర కోసం వాణీ కపూర్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం. వాణీ కపూర్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో కనిపించనుంది. వాణీ నటించిన షంషేరా త్వరలో రిలీజ్ కానుంది. ఇది ప్రేక్షకులకు విజువల్ వండర్ గా మెరిపిస్తుందని వాణీ చెబుతోంది. రణబీర్ కపూర్.. సంజయ్ దత్ .. వాణి కపూర్ ఇందులో నటించారు.