లాక్ డౌన్ టైమ్ లో మీడియా ద్వారా మస్త్ ఎంటర్ టైన్ మెంట్ ను తన మూడవ పెళ్లి ఆ తర్వాత జరిగిన వివాదాలతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ కు కూడా అందించిన నటి వనిత విజయ్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈమె మూడవ పెళ్లి చేసుకున్నప్పటి నుండి కూడా వార్తల్లోనే ఉందనుకోండి. ఇప్పుడు మరోసారి ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. ఈమె ప్రస్తుతం మూడవ భర్తకు దూరం అవ్వాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కొన్ని రోజుల క్రితం గోవా ట్రిప్ నుండి తిరిగి వచ్చిన ఈ జంట మద్య గొడవలు తలెత్తాయట.
వనిత మూడవ పెళ్లి చేసుకున్న పీటర్ పాల్ తాగుబోతు మరియు చైన్ స్మోకర్. దాంతో ఆయన ఆరోగ్యం సరిగా లేదు. పెళ్లికి ముందే గుండె పోటు రావడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. పెళ్లి తర్వాత తాగుడు మానస్తాను అంటూ హామీ ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. కాని పెళ్లి తర్వాత కూడా అతడు తాగుడు మానలేదు అంటూ వనత ఎమోషనల్ అయ్యింది. అతడి ఆరోగ్యం కోసం తాను ఇప్పటికే పాతిక లక్షల వరకు ఖర్చు చేశాను అంది. ఇంకా తన వల్ల కాదు అన్నట్లుగా ఆమె పేర్కొంది. ఆరు నెలల్లోనే మూడవ పెళ్లిని పెటాకులు చేసుకునే ఆలోచనలో వనిత ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇదే సమయంలో వనిత త్వరలో బీజేపీలో జాయిన్ అయ్యేందుకు సిద్దం అవుతుందట. ఇటీవలే ప్రముఖ నటి ఖుష్బు బీజేపీ తీర్థం పుచ్చకుంది. కనుక ఆమె కూడా బీజేపీలో జాయిన్ అవ్వాలనుకుంటుందట. వచ్చే ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఛాన్స్ ఉంటే ఎక్కడో ఒక చోట ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా సిద్దం అన్నట్లుగా వనిత ఉందట. మూడవ పెళ్లి పెటాకులు చేసుకున్న ఈమె ఇప్పుడు కొత్తగా రాజకీయ అడుగులు వేయడం విడ్డూరంగా ఉందని, వచ్చే ఎన్నికల తర్వాత నాల్గవ పెళ్లికి సిద్దం అవ్వడం కూడా ఖాయం అవ్వొచ్చు అంటున్నారు.