నెల రోజులుగా తమిళ హీరోయిన్ వనిత విజయ్ కుమార్ మూడవ పెళ్లి గురించి పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. పీటర్ ను మూడవ వివాహం చేసుకున్న వనితకు పీటర్ భార్య నుండి షాక్ తలిగింది. పీటర్ భార్య ఎలిజబెత్ తన భర్తను వనిత పెళ్లి చేసుకుంది అంటూ కోర్టుకు ఎక్కింది. దాంతో ఇతరుల భర్తను పెళ్లి చేసుకోవడానికి బుద్ది లేదా అంటూ కొందరు సోషల్ మీడియాలో అసభ్యకరంగా వనితను విమర్శించారు. దాంతో వారిపై వనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వనిత ఫిర్యాదుతో కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిలో ఒకరికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. అరెస్ట్ అయిన ఆమె ఆ తర్వాత బెయిల్ పై వెళ్లి పోయింది. ఆమె పోలీస్ స్టేషన్ లో చాలా సమయం ఉండటంతో పాటు లేడీ కానిస్టేబుల్స్ తో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యింది. అదే విధంగా ఆమె పోలీస్ స్టేషన్ లో ఇతర స్టాఫ్ తో కూడా కాంటాక్ట్ అయ్యింది. ఇప్పటికే ఒక కానిస్టేబుల్ కు ఆ లేడీ వల్ల కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
ప్రస్తుతం కేసు నమోదు అయిన వడపళని స్టేషన్ సిబ్బంది అంతా కూడా స్వీయ నిర్బందంలోకి వెళ్లారు. ఇప్పటికే కొందరికి పరీక్షలు నిర్వహించగా మరికొందరికి కూడా పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. వనిత విజయ్ కుమార్ కూడా స్టేషన్ కు వెళ్లిన కారణంగా ఆమె స్వీయ నిర్బందంలో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. మొత్తానికి వనిత మూడవ పెళ్లి వ్యవహారం వడపళని పోలీసులకు కరోనా తలనొప్పిగా మారింది.