అభిమానం ఉంటే అది మాత్రం చేయండి చాలంటున్న‌ వ‌ర‌ల‌క్ష్మి!

Update: 2022-11-08 07:30 GMT
ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. భారీ సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే విలక్షణ న‌టిగా గుర్తింపు పొంది భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు స్టార్ హీరోల సినిమాల్లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల‌ను చేస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో వరలక్ష్మి దాదాపు పది చిత్రాల్లో భాగమైంది. ఇక ఆమె నటించిన 'యశోద' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సమంత టైటిల్ రోల్ లో తెర‌కెక్కిన ఈ సినిమాకు హరి-హరీష్ ద్వ‌యం దర్శకత్వం వహించారు.

శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన‌ ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 11న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదల కాబోతోంది.

అయితే మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న కారణంగా సమంత‌ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుంది. దీంతో సమంత తర్వాత ఆమెకు స‌మాంత‌ర పాత్రను పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటూ యశోద పై హైప్ క్రియేట్ చేస్తుంది. ఇందులో భాగంగా వరలక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఈ సందర్భంగా ఆమె సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. యశోద ఒక ఫిక్షనల్ స్టోరీ అని, ఇందులో సరోగసి ఒక టాపిక్ మాత్రమే అని వ‌ర‌ల‌క్ష్మి చెప్పుకొచ్చింది. ఈ క్ర‌మంలోనే సినీ తార‌ల వ్యక్తిగత జీవితాల గురించి కూడా ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది. వ‌ర‌ల‌క్ష్మి మాట్లాడుతూ.. 'ఇప్పుడంతా సెలబ్రిటీల లైఫ్ లో సరోగసి గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు.

ఎవరికి వారు తమ లైఫ్ కి సంబంధించిన విషయాలను పక్కన పెట్టేసి, ఇతరుల లైఫ్ లోకి తొంగి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం వాళ్లకి పని లేకపోవడమే. సినీ తార‌ల‌ పట్ల అభిమానం ఉంటే వారి సినిమా చూడండి .. ఎలా ఉందో చెప్పండి చాలు. అంతేగానీ వాళ్ల పర్సనల్ విషయాలను గురించి మాట్లాడ‌వ‌ద్దు. ఆ హక్కు ఎవరికీ లేదు' అంటూ చెప్ప‌కొచ్చింది. దీంతో వరలక్ష్మి చేసిన కామెంట్స్ కాస్త నెట్టింట‌ వైరల్ గా మారాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News