కరోనా లాక్డౌన్ తో థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో షూటింగ్ పూర్తి చేసుకున్న పలు సినిమాలు విడుదలకు నోచుకోలేదు. కొన్ని నెలల్లో పరిస్థితి అంతా సాధారణంగా అవుతుందని అంతా భావించినా, మూడు నెలలు దాటినా తేడా రాలేదు. మరోవైపు కరోనా కేసులు తీవ్రతరం అవుతూనే ఉండడంతో ఇప్పటికిప్పుడు థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేదని అంతా భావిస్తున్నారు. ఇక థియేటర్లలో సినిమాలు విడుదల చేయడానికి అవకాశం లేకపోవడంతో పలువురు అమెజాన్, హాట్ స్టార్, ఆహా వంటి ఓటీటీల్లో తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఓటీటీల్లో ఆశించినంత మేర బిజినెస్ జరగక పోవడంతో భారీ బడ్జెట్ సినిమాలు ఇంకా విడుదల కాలేదు. కానీ చిన్న సినిమాలు మాత్రం ఎక్కువ రోజులు వేచి చూస్తే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉండడంతో ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాము ఏర్పాటు చేసిన 'ఆహా' యాప్ కోసం జీఏ 2 టు పిక్చర్స్ లో పలు వెబ్ సిరీస్ లు సిద్ధం చేస్తున్నారు. అలాగే చిన్న సినిమాలను కూడా నిర్మించి విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా ఓటీటీ కోసం చిన్న సినిమాలు నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఓటీటీ వేదికగా సినిమాలను విడుదల చేసేందుకు ఇప్పటికే 9 కథలు సిద్ధం చేశారు. తన సొంత నిర్మాణ సంస్థ అయిన సుకుమార్ రైటింగ్స్ ద్వారా ఆ చిత్రాలను నిర్మించి ఓటీటీల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అగ్ర దర్శకుడు కొరటాల శివ కూడా వెబ్ సిరీస్ కు కథలు సిద్ధం చేసే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. ఇక దర్శకురాలు నందినీరెడ్డి ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించారు. ఇక వెబ్ సిరీస్ లో నటించేందుకు సమంత, తమన్నా, ప్రియమణి, కాజల్ నిత్యా మేనన్ వంటి వారు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వీరు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. తాజాగా ఆనంద వికటన్ అనే సంస్థ దర్శకుడు సూర్య సుబ్రహ్మణ్యం తో ఓ వెబ్ సీరిస్ ను ప్లాన్ చేయగా అందులో ప్రముఖ హీరోయిన్లు వరలక్ష్మి, ఐశ్వర్య సవతులుగా నటించనున్నట్లు తెలిసింది. మంచి కథ, పోటాపోటీగా పాత్రలు ఉండడంతో వెబ్ సీరిస్ లో నటించేందుకు ఇద్దరు హీరోయిన్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.