పెళ్లి చేసుకుంటే గ‌ట్టిగా అరిచి చెబుతాను

Update: 2020-05-20 04:15 GMT
క‌థానాయిక‌ల‌కు ఏజ్ బార్ అవుతుంటే పెళ్లెప్పుడు అని ప్ర‌శ్నించ‌డం స‌హ‌జ‌మే. మీడియా కంట ప‌డితే ప‌దే ప‌దే ఈ ప్ర‌శ్న ఎదుర‌వుతూనే ఉంటుంది. దానికి ఆన్స‌ర్ ఇవ్వాల్సి ఉంటుంది. అనుష్క‌-త్రిష‌-న‌య‌న‌తార - త‌మ‌న్నా .. ఇలా తార‌లంద‌రికీ అనుభ‌వ‌మే. ఇటీవ‌ల   లేడీ విల‌న్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కి కూడా ఇదే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. ప‌దే ప‌దే సోష‌ల్ మీడియాల్లో పెళ్లి గురించి ప్ర‌చారం సాగుతుంటే విసిగిపోయిన ఆమె ఏమందో తెలుసా?

``ఎందుకో నా పెళ్లి విషయం అందరి కంటే నాకే చివరిలో తెలుస్తోంది. హా హా హా .. మళ్లీ అవే నాన్సెన్స్‌ రూమర్లు. నా పెళ్లిపైనే ఎందుకో అందరికీ అంత ఆసక్తి. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే.. దానిని గట్టిగా అరిచి చెప్తాను`` అని అంది. ``నేను పెళ్లి చేసుకోను. సినిమాలు వదిలేయను`` అని వరలక్ష్మి ట్వీట్ చేసింది. రూమర్ల వలన నా గురించి నాకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాన‌ని అంది.

ఇక వ‌ర‌ల‌క్ష్మి త‌న క్లోజ్ ఫ్రెండ్ విశాల్ ని పెళ్లాడుతుంద‌ని అప్ప‌ట్లో ప్రచార‌మైంది. పందెంకోడి 2 రిలీజ్ స‌మ‌యంలో ఇదే ప్ర‌శ్న తెలుగు మీడియా అడిగితే సింపుల్ గా న‌వ్వేస్తూ.. విశాల్ త‌నకు ఫ్రెండ్ అని తెలిపింది. విశాల్ ని ప్ర‌శ్నించినా అదే విధంగా స్పందించాడు. ఇప్పుడు మ‌రోసారి వ‌ర‌ల‌క్ష్మి పెళ్లి గురించి సోష‌ల్ మీడియాలో విస్త్ర‌తంగా ప్ర‌చార‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం రవితేజ హీరోగా నటిస్తోన్న `క్రాక్`‌లో వ‌ర‌ల‌క్ష్మి విల‌న్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలోనూ ప‌లు చిత్రాల‌తో బిజీగా ఉంది.
Tags:    

Similar News