రీల్ ప్రేమలో లవ్వరే విలన్

Update: 2017-05-30 07:42 GMT
తమిళ్ సినిమా  ఇండస్ట్రి లో  ఇప్పుడు హాట్ లవ్ స్టోరీ అంటే అది హీరో విశాల్ అండ్ వరలక్ష్మిదే. ఈమె నిన్నటి తరం హీరో శరత కుమార్ కూతురు. హీరో శరత్ కుమార్ కుటంబానికి విశాల్ కు ఆ మధ్య కొన్ని గొడవలు కూడా జరిగాయి. అయితే విశాల్ ప్రేమ ఏమి అందులో పడి చితికిపోలేదట. ఇక ఇప్పుడు మనోడి కెరియర్ ను నిలబెట్టిన 'పందెంకోడి' సీక్వెల్‌లో ఇప్పుడు ఈ జంట కలిసి నటించబోతుంది.

వరలక్ష్మి కి ఇప్పుడు చెప్పుకోతగ్గ సినిమాలు ఏమి లేవు. విశాల్ కూడా వరుస ఫ్లాప్ లతో కాస్త డీలా పడ్డాడు. 'పందెంకోడి' సీక్వెల్‌లో ఒక కీలక పాత్ర కోసం ఒక స్టార్ హీరోయిన్ కోసం చూస్తున్నాడట డైరెక్టర్ లింగుస్వామి. కానీ అది కుదరకపోవడంతో ఆ పవర్‌ఫుల్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రకు వరలక్ష్మిని హీరో విశాల్ రికమండ్‌ చేసాడని టాక్. ఇందులో వరలక్ష్మి పాత్ర  రజినీకాంత్ సినిమా నరసింహలో రమ్యకృష్ణ లా ఉంటుందట. లవర్ అన్నాక ఆ మాత్రం సపోర్ట్ లేకుంటే ఎలా చెప్పండి. కాకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్‌ నటిస్తోంది. రియల్ లైఫ్ లో విశాల్ ప్రేమకు శరత్ కుమార్ విలన్ గా మారితే ఇక్కడ రీల్ ప్రేమ లో లవర్ వరలక్ష్మి విలన్ గా చేస్తోంది.

ఏదేమైనా కూడా తమిళనాట ఇప్పుడు లవ్వర్లు మాజీ లవ్వర్లు కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. శింబుతో నయనతార అందరికంటే బ్రైట్ ఎగ్జాంపుల్ అయితే.. ఇప్పుడు వరలక్ష్మి విశాల్ మరో ఎగ్జాంపుల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News