వాల్తేరు ప్రెస్ మీట్ లో ఆ టాపిక్ రాలేదేంటీ?

Update: 2022-12-28 06:27 GMT
మెగా స్టార్ చిరంజీవి న‌టిస్తున్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'వాల్తేరు వీర‌య్య‌'. బాబి డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న మూవీ ఇది. చిరుకు జోడీగా క్రేజీ హీరోయిన్ శృతిహాస‌న్ న‌టిస్తుండ‌గా కీల‌క అతిథి పాత్ర‌లో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్నాడు. 'ఆచార్య' డిజాస్ట‌ర్ అనిపించుకోవ‌డంతో ఫ్యాన్స్ ఆశ‌ల‌న్నీ వీర‌య్య‌పైనే వున్నాయి. దీంతో ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

సంక్రాంతి రేసులో భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ మూవీ దిగ‌బోతోంది. ఇప్ప‌టికే వార్ డిక్లేర్ చేసిన వీర‌య్య లిరిక‌ల్ వీడియోల‌తో నెట్టింట దుమ్ములేపుతూ సంక్రాంతి సినిమాల స‌మ‌రంలో ముందు వ‌రుస‌లో నిలుస్తున్నాడు.

బాస్ పార్టీ, రీసెంట్ టైటిల్ సాంగ్ ల‌కు దేవి సంగీతం ఓ రేంజ్ లో  ఇవ్వ‌డంతో సినిమా ఓ రేంజ్ లో వుండ‌నుంద‌ని మెగా ఫ్యాన్స్ అప్పుడే అంచ‌నాలు వేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ సంక్రాంతికి జ‌న‌వ‌రి 13న రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌న‌థ్యంలో రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ జోరు పెంచేశారు.

ఈ సంద‌ర్భంగా అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో షూటింగ్ జ‌రుగుతున్న సంద‌ర్భంగా అక్క‌డ వేసిన బోట్ సెట్ లో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో చిరంజీవి, ర‌వితేజ‌, డైరెక్ట‌ర్ బాబి, ఊర్వ‌శీ రౌతేలా, దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, రాజేంద్ర ప్రసాద్, నిర్మాత‌ల‌లో ఒక‌రైన ర‌విశంక‌ర్‌, చెర్రీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాపై ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. బాబీ క‌థ చెప్పిన‌ప్పుడే ఏద విష‌యం వుంద‌ని అనిపించింద‌ని, సినిమా ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఈ మీడియా మీట్ లో సంక్రాంతికి పోటీగా రిలీజ్ అవుతున్న దిల్ రాజు 'వార‌సుడు' వివాదంపై ఎలాంటి చ‌ర్చ రాక‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. విజ‌య్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న త‌మిళ చిత్రంవ 'వారీసు'ని తెలుగులో 'వార‌సుడు'గా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం దిల్ రాజు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన థియేట‌ర్ల‌ని బ్లాక్ చేసి పెట్టుకున్నాడ‌ని, ఆ కార‌ణంగా కొన్ని చోట్ల 'వాల్తేరు వీర‌య్య‌'కు,. బాల‌య్య 'వీరి సింహారెడ్డి'కి ప్ర‌ధాన థియేట‌ర్లు ల‌భించ‌ని ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయని ఇటీవ‌ల పెద్ద దుమార‌మే రేగుతోంది.

ఇలాంటి స‌మ‌స్యాత్మ‌క‌మైన విష‌యంలో మీడియా చిరుని ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు? .. కావాల‌నే ఆ ప్ర‌శ్న‌ని మీడియా దాట‌వేయాల‌నుకుందా? లేక మీడియాని ఆ ప్ర‌శ్న వేయ‌వ‌ద్ద‌ని ఎవ‌రైనా క‌ట్ట‌డి చేశారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News