‘బాహుబలి: ది బిగినింగ్ ’ దెబ్బకు అప్పటిదాకా ఉన్న టాలీవుడ్ కలెక్షన్ల రికార్డులన్నీ బద్దలైపోయాయి. ఆ సినిమా కనీ వినీ ఎరుగని స్థాయిలో బాక్సాఫీస్ నంబర్స్ నమోదు చేయడంతో.. టాలీవుడ్ కలెక్షన్ల రికార్డుల ప్రస్తావన వచ్చినపుడల్లా ‘నాన్-బాహుబలి’ అనే కొత్త కేటగిరిని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఎవ్వరూ కూడా బాహుబలి రికార్డుల గురించి ఆలోచించే పరిస్థితి ఉండదనే అనుకున్నారంతా. కానీ నెమ్మదిగా ‘ది బిగినింగ్’ కలెక్షన్ల రికార్డులకూ ముప్పు వాటిల్లింది. కొన్ని ఏరియాల్లో రికార్డులు చెదిరిపోయాయి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ ఏకంగా డే-1 ‘బాహుబలి’ రికార్డుల్ని చెరిపేసి సంచలనం సృష్టించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ చిత్రం ఫస్ట్ డే ఏకంగా రూ.23.24 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.
కానీ ఆ రికార్డును ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’ భారీ తేడాతో బద్దలు కొట్టేసింది. ఈ చిత్రానికి తొలి రోజు ఏకంగా రూ.43.19 కోట్ల షేర్ రావడం విశేషం. అంటే చిరు సినిమాకు.. దీనికి అంతరం దాదాపు రూ.20 కోట్లన్నమాట. దీన్ని బట్టి సమీప భవిష్యత్తులో ‘ది కంక్లూజన్’ డే-1 రికార్డులు చెరిగిపోయే అవకాశమే లేదన్నమాట. ఇక ఏరియాల వారీగా ఖైదీ నెంబర్ 150.. బాహుబలి-2 తొలి రోజు వసూళ్లను పోల్చి చూస్తే.. ఉత్తరాంధ్రలో చిరు సినిమా రూ.2.59 కోట్లు వసూలు చేయగా.. బాహుబలి-2 రూ.రూ.4.52 కోట్లు కొల్లగొట్టింది. సీడెడ్ (రాయలసీమ)లో ‘ఖైదీ’ రూ.4 కోట్లు తెస్తే.. ‘బాహుబలి-2’ రూ.6.35 కోట్లు వసూలు చేసింది. నైజాం (తెలంగాణ)లో ఈ సినిమాలు రూ.4.77 కోట్లు ‘ఖైదీ’ వసూలు చేస్తే.. రాజమౌళి సినిమా రూ.8.9 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలు వరుసగా తూర్పుగోదావరిలో రూ.3.5 కోట్లు- రూ.5.93 కోట్లు.. పశ్చిమ గోదావరిలో రూ.3 కోట్లు-రూ.6.08 కోట్లు.. కృష్ణాలో రూ.1.59 కోట్లు-రూ.2.82 కోట్లు.. గుంటూరులో రూ.2.79 కోట్లు-రూ.6.18 కోట్లు.. నెల్లూరులో రూ.1 కోటి-రూ.2.4 కోట్లు వసూలు చేశాయి. రెండు సినిమాల మధ్య దాదాపుగా ప్రతి చోటా అంతరం భారీ స్థాయిలోనే ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/