జ‌నాల‌ కోసం వర్మ వ‌దిలిన జ్ఞాన గుళిక‌!

Update: 2022-08-20 08:03 GMT
మ‌నిషి జీవ‌న విధానం..జీవితం గురించి డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ ఎప్ప‌టిక‌ప్ప‌డు క్లాస్ లు పీకుతూనే ఉంటాడు. పూరి మ్యూజింగ్స్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నే  ఓపెన్ చేసి త‌న అభిప్రాయాలు అన్నింటిని అందులో పంచుకుంటారు. 16 ఏళ్ల ప్ర‌యాణం ద‌గ్గ‌ర నుంచి 90 ఏల్ల ముస‌లాడి వ‌ర‌కూ  బ్ర‌తికినంత కాలం ఎలా  బ్ర‌త‌కాలి? అన్న‌ది పూస గుచ్చిన‌ట్లు చెప్పుకొచ్చాడు.

సింపుల్ గా జీవితం నీటి బుడ‌గ లాంటింది.  ఎప్పుడైనా  ప‌గిలిపోవ‌డానికి  ఛాన్స్ ఉంటుంది. కాబ‌ట్టి ఈలోపు జీవితాన్ని ఆస్వాదించ‌డ‌మే ప‌నిగా పెట్టుకోండి అన్న‌ది అత‌ని ఉద్దేశంగా చెప్పొచ్చు.  పూరి సినిమాల ద్వారా సందేహాలివ్వ‌డు. ఇచ్చినా ఎవ‌రు తీసుకోడు అని తెలిసే ఆ విష‌యాన్ని త‌న సినిమాల్లో చెప్ప‌ను అంటాడు.

కానీ జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విష‌యాలు మాత్రం యూ ట్యూబ్   ద్వారా  షేర్ చేస్తుంటాడు. అవి నేరుగా యువ‌త‌ని ఉద్దేశించి ఎటాకింగ్ గా ఉంటాయి.  బ్ర‌తికినంత కాలం ఇలా బ్ర‌త‌కండ‌ని గ‌ట్టిగానే చెప్పాడు. ఇవ‌న్నీ పూరి గురువు రాంగోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర నుంచి నేర్చుకున్న‌వి. ఇక వ‌ర్మ శైలి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

ఆయ‌నకు జ‌నాల‌కు క్లాస్ లు పీక‌డం..సందేశాలివ్వ‌డం అంటే న‌చ్చ‌దు. సినిమాల ద్వారా కూడా అలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌డు.  ఏదైనా తాను చేయాల‌నుకున్న‌ది చేస్తాడు. త‌న మార్గంలోకే ఎవ‌రైనా వెళ్లాలి. త‌ప్ప ఆయ‌న వేరే వాళ్ల దారిలోకి వెళ్ల‌డు. అదే వ‌ర్మ నైజం . స‌మాజాన్ని వ‌ర్మ చూసే కోణం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. అది ఆయ‌న మాత్ర‌మే సృష్టించుకున్న దృక్కోణం.

అందుకే ఆయ‌నెప్పుడు?  జ‌నాల‌కు నీతుల బోధించాల‌ని చూడ‌డు. అయితే అలాంటి వ‌ర్మ తొలిసారి జ‌నాల‌కు ఓ జ్ఞాన గుళిక అంటూ ఇలా స్పందించాడు. ఇలా జీవించ‌గ‌ల్లిగితేనే ఎప్పుడూ సంతోషంగా ఉంటామ‌నే మాట వేసాడు.

"అప్పుడ‌ప్పుడు కొంచెం చిల్ అవ్వ‌డం నేర్చుకోండి.  మ‌రీ లైఫ్ ని అంత సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. సంతోషంగా ఉండండి. దేవుడిచ్చిన  ఒత్తిళ్ల‌ను ఎంజాయ్ చేయ‌డం నేర్చుకోండి. ఇది నా చిన్న జ్ఞాన గుళిక మీకోసం " అంటూ ఓ వీడియో రిలీజ్ చేసాడు. పూరి సైతం ఇవే  మాట‌లు గ‌తంలో చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు ఆయ‌న గురువుగారు వంతు పాడారు.
Tags:    

Similar News