ఆల్ ఖైదాని ట‌చ్ చేసిన వ‌ర్మ‌..9 /11 దాడుల‌పై!

Update: 2022-07-13 13:30 GMT
సంచ‌ల‌నం లేనిదే అక్క‌డ రాంగోపాల్ వ‌ర్మ ఉండ‌రు అన్న‌ది తెలిసిందే. ఆయ‌న తీసే సినిమా ద‌గ్గ‌ర నుంచి మాట్లాడే మాట వ‌ర‌కూ ప్ర‌తీది వివాదాస్ప‌ద‌న‌మైన సంచ‌ల‌న అంశ‌మే ఉంటుంది. ఇటీవ‌లే 'కొండా' అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి  తెలిసిందే. కొండ సురేఖ దంప‌తుల బ‌యోపిక్ ని తెర‌కెక్కించి ప్ర‌శంస‌లందుకున్నారు.

తాజాగా మ‌రో బ‌యోపిక్ కి రంగం సిద్దం చేస్తున్నారు. ఈసారి ఏకంగా  ఉగ్ర‌వాద సంస్థ ఆల్ ఖైదానే కెలుకుతున్నారు. 9 /11 దాడుల సూత్ర‌దారి  రింగ్ లీడర్ ఖాలీద్  మొహ్మ‌ద్ అట్ట జీవితం నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్రక‌టించారు. ఈ చిత్రాన్నికేవ‌లం ఇంగ్లీష్..అర‌బిక్ భాష‌ల్లోనే అమెరికాలో తెర‌కెక్కిస్తున్నారుట‌.

మ‌రి దీన్ని ఓ టీటీలో రిలీజ్ చేస్తారా? థియేట‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారా? అన్న దానిపై స్పష్ట‌త ఇవ్వ‌లేదు గానీ...వ‌ర్మ ఆల్ ఖైదాని కెల‌క‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ముంబై దాడుల నేప‌థ్యంలో 26/11 చిత్రాన్ని తెర‌కెక్కించి సంచ‌ల‌నం సృష్టించారు. అప్ప‌టికే ప్లాప్ లో ఉన్న వ‌ర్మ మ‌న‌సు పెట్టి సినిమా చేస్తే ఎలా ఉంటుంద‌న్న‌ది 26/11 రుజువు చేసింది.  

వ‌ర్మ విధ్వంసం ఎలా ఉంటుంద‌న్న‌ది ఆ సినిమా రుజువు చేసింది. వ‌ర్మ ఎనాల‌సిస్ ఎంత గొప్ప‌గా ఉంటుంద‌న్న‌ది ఆ సినిమా ద్వారా ప్రేక్ష‌కుల‌కు అర్ధ‌మైంది. ఆ త‌ర్వాత డిఫ‌రెంట్ జాన‌ర్ సినిమాలు చేసుకుంటూ వ‌చ్చారు. అయితే మ‌ళ్లీ  టెర్ర‌ర్ ఎటాక్స్ నే త‌న క‌థాంశంగా ఎంచుకుని షాక్ ఇచ్చారు.  స‌రిగ్గా 20 ఏళ్ల క్రితం అమెరికా ట్విన్ ట‌వ‌ర్స్ దాడిలో సూత్ర‌ధారిగా ఉన్న ఖాలీద్ మొహ‌మ్మ‌ద్ క‌థ ఎంతో ఆస‌క్తి ఉంటుంద‌ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

విమానాల‌తో ట్విన్ ట‌వ‌ర్ల‌ని ఢీకొట్టాల‌నే ఆలోచ‌న‌ని అల్ ఖైదా మందుకు తీసుకెళ్లింది మోహ‌మ్మ‌ద్ నే. అత‌ని ప్లానింగ్ న‌చ్చి ఆల్ ఖైదా వెంట‌నే అమ‌లు చేయాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఆ త‌ర్వాత  ట్విన్ ట‌వ‌ర్ల‌పై దాడి..మొహ‌మ్మ‌ద్ అరెస్ట్ అవ్వ‌డం జ‌రిగింది . వాస్త‌వానికి ఆల్ ఖైదా నేత‌గా ఉన్న ఒసామాబీన్ లాడెన్ ప్ర‌ధాన కార‌ణం అంటారు.

కానీ ద‌ర్యాప్తులో ఖాలీద్ మొహ‌మ్మ‌ద్  పేరు తెర‌పైకి వ‌చ్చింది.   ప్ర‌స్తుతం ఖాలిద్ మొహ‌మ్మ‌ద్ అమెరికా జైలులో ఉన్నాడు. కేసు 20 ఏళ్ల‌గా విచార‌ణ సాగుతూనే ఉంది. ఇంత స‌మ‌యం ప‌డుతుంద‌ని  ఆనాడే లాయ‌ర్లు జోస్యం చెప్పారు. అందుకే వ‌ర్మ ఇప్పుడు ఈ యాక్టివ్ అంశాన్ని ట‌చ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News