ట్విట్టర్ గోల తట్టుకోలేక ట్వీటేసిండు

Update: 2017-07-13 06:56 GMT
ఇప్పుడు అసలు రూమర్ అనేదే రాకూడదు. ఒకవేళ వస్తే మాత్రం.. దానిని గురించి ఎలా స్పందించినా కూడా ఏదో ఒక కొత్త రూమర్ వస్తూనే ఉంటుంది. అదిగో మొన్నటికి మొన్న వరుణ్‌ సందేశ్ భార్య.. హీరోయిన్ వితికా షెరు ఆత్మహత్య చేసుకుందనే రూమర్ వచ్చింది. పొరపాటును రెండు నిద్రమాత్రలు వేసుకుని టైముకు నిద్రలేవకపోయేసరికి.. ఇలాంటి రూమర్లు వచ్చేశాయి. అయితే దీనిపై నెటిజన్ల స్పందన మరోలా ఉంది.

అసలు సోమవారం రాత్రే ఈ రూమర్లపై స్పందించింది వితిక. అప్పటికప్పుడు లైవ్ లో కూడా చాలా టివి ఛానళ్ళకు క్లారిటీ ఇచ్చింది. ముందుగా ఒక ట్వీట్ కూడా చేసింది. ఇదంతా చూస్తున్న నెటిజన్లు.. ''అన్నీ వితికే చెబుతుందా? ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వరుణ్‌ సందేశ్‌ స్పందించడా? కేవలం రీట్వీట్లు చేస్తాడంతేనా?'' అంటూ మనోడిపై విరుచుకుపడ్డారు. కనీసం ఒక వీడియో మెసేజ్ కూడా ఇవ్వలేకపోయాడంటూ కొందరు కామెంట్లు చేశారు. దానితో వెంటనే వరుణ్‌ సందేశ్‌ కూడా ఒక ట్వీట్ వేయకతప్పలేదు. ''నేను నా భార్య ఒకరినొకరం అందరికంటే ఎక్కువగా ఘాడంగా ప్రేమించుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉన్న జంట మేము. దయచేసి రూమర్లను స్ర్పెడ్ చేయకండి'' అంటూ ట్వీటేశాడు.

ఏదేమైనా కూడా.. అందరూ మర్చిపోయారు అనుకున్న వరుణ్‌ సందేశ్‌ సడన్ గా ఒక్కసారి మళ్ళీ వార్తల్లకో వచ్చేశాడు. ఇకపోతే ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్న ఈ హ్యాపీ డేస్ హీరో.. మరోసారి తన లక్ చెక్ చేసుకోవడానికి టాలీవుడ్ ఎప్పుడొస్తాడో ఏంటో.
Tags:    

Similar News