మెగా నందమూరి వార్ లో దించాలని..

Update: 2018-07-02 14:12 GMT
సినిమా ఇండస్ట్రీలో పోటీ అనేది చాలా కామన్. అయితే చాలా వరకు కొందరు పెద్ద నిర్మాతలు ఒకే సమయంలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే అస్సలు ఒప్పుకోరు. కానీ ఫెస్టివల్ సీజన్స్ లలో మాత్రం కొందరు నిర్మాతలు పోటీకి సయ్యంటు ఉంటారు. అందులో దిల్ రాజు ముందుంటారు. సక్సెస్ కథలను పట్టడంలో దిల్ రాజు శైలే వేరు. ఇక ఆ సినిమాను పండగలకు రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారంటే ఎలాంటి మార్పు ఉండదు.

గతంలో శతమనం భవతి సినిమాతో తన ఆలోచన చాలా బలమైందని ఈ బడా ప్రొడ్యూసర్ చెప్పకనే చెప్పారు. ఖైదీ నెంబర్ 150 - గౌతమి పుత్ర లాంటి బడా సినిమాలు వచ్చినప్పటికీ నమ్మకంతో ఫ్యామిలీ కథలు తప్పకుండా ఆడతాయని పెద్ద ప్రయోగమే చేశారు. సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు అదే తరహాలో మెగా నందమూరి సినిమాలు సంక్రాంతి కి రిలీజ్ అవుతుండగా దిల్ రాజు తన మల్టీస్టారర్ సినిమాను అదే సమయంలో రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నాడు.

వెంకటేష్-వరుణ్ తేజ్ తో F2 అనే సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ఆ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. డిసెంబర్ లో సినిమా షూటింగ్ ని పూర్తి చేయాలని ఇప్పటికే షెడ్యూల్ ని సెట్ చేసుకున్నారు. ఇక సంక్రాంతి సమయనికి రామ్ చరణ్ - బోయపాటి కాంబో రానుంది. అలాగే బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమా కూడా అదే సమయంలో రానుంది. ఈ మెగా నందమూరి వార్ లో దిల్ రాజు F2 దింపనున్నాడు. మరి గతంలో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నట్లు ఈ సారి అందుకుంటాడో లేదో చూడాలి.
Tags:    

Similar News