అవునుండి కాపే. కాకపోతే సినిమా అంతా కాప్ కాదండోయ్. కేవలం ఒకేఒక్క సీన్లో కాప్ గా కనిపిస్తాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఇంతకీ మనోడ్ని ఇలా పోలీసు దుస్తులు వేయిస్తున్న ఆ దర్శకుడు అనేదే మీ సందేహమా. అయితే పదండి ఆ సంగతేంటో చూసేద్దాం.
దాదాపు ''దూకుడు'' సినిమా నుండి శ్రీను వైట్లకు ఈ కాప్స్ తాలూకు సెంటిమెంట్ ఏదో గాట్టిగానే తగులుకుంది. ''బాద్షా'' ''ఆగడు'' వంటి సినిమాల్లో కూడా హీరోలు కాప్ లే. చరణ్ తో తీసిన ''బ్రూస్ లీ'' సినిమాలో కూడా ఒక సీన్లో మనోడు పోలీస్ గెటప్ లోనే కనిపిస్తాడు. సినిమా అంతా మనోడు ఏదో అండర్ కవర్ కాప్ అన్నట్లే కథ నడుస్తుంటుంది. ఇకపోతే ఇప్పుడు ''మిష్టర్'' సినిమాలో వరుణ్ తేజ్ కూడా ఒక సీక్వెన్సులో కాప్ గానే కనిపిస్తాడట. శ్రీను వైట్లకు ఈ సెంటిమెంట్ల పిచ్చేంటో తెలియదు కాని.. ఇలా ఆయన సినిమాలోని హీరోలందరూ ఖాకీలో కనిపిస్తుంటే ఆడియన్స్ కు మాత్రం కొత్తగా అనిపించట్లేదు.
ఇకపోతే అసలు ''మిష్టర్'' సినిమాను ఎప్పుడు మొదలు పెడుతున్నారు సారూ??