ప్రతి ఏడాది లాగే ఈ ఇయర్ లో కూడా కొన్ని హాట్ టాపిక్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసి చర్చింకునేలా చేసాయి. అయితే 2019 లో అలాంటి సినిమా వార్తలెన్ని ఉన్నా రెండు వార్తలు మాత్రం అందరికి షాక్ ఇచ్చి కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్ గా నిలిచాయి. ఆ రెండు వార్తల్లో ఒకటి మహేష్ -అల్లు అర్జున్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అంటూ ప్రకటన రావడం ఒకటైతే రెండోది రేపు రిలీజ్ అనగా వరుణ్ సినిమా టైటిల్ మారడం మరో హాట్ టాపిక్ న్యూస్.
మహేష్ బాబు - అల్లు అర్జున్ వచ్చే సంక్రాంతికి పోటీ పడబోతున్నారని అందరికీ తెలిసినా ఒకే రోజు రిలీజ్ అనే అనౌన్స్ మెంట్ మాత్రం అటు ఫ్యాన్స్ ను ఇటు ఇండస్ట్రీ వర్గాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కొన్ని గంటల పాటు ఈ టాపిక్ మీద గట్టి చర్చే నడిచింది. అయితే చాలా రోజుల తర్వాత ఓ మీటింగ్ పెట్టుకొని అందులో మహేష్ సినిమా రిలీజ్ డేట్ మారిందని చెప్పే వరకూ అందరూ సంక్రాంతి సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు.
ఇక వరుణ్ తేజ్ 'వాల్మీకి' సినిమా రేపు రిలీజ్ అనగా ముందు రోజు అర్తరాత్రి 'గద్దల కొండ గణేష్' అని టైటిల్ మార్చడం కూడా హాట్ టాపిక్ అయింది. ఓ సంఘం వేసిన పిటీషన్ మేరకూ రాత్రికి రాత్రే టైటిల్ మార్చి తెల్లారి నుండి మళ్ళీ కొత్త టైటిల్ తో సినిమాను రిలీజ్ చేసారు మేకర్స్. ఇది ఈ ఏడాది జరిగిన ఓ వింతే అనొచ్చు. మునుపెన్నడూ ఇలా రేపు రిలీజ్ అనగా ఈరోజు టైటిల్ మారడం జరగడం లేదు. ఏదేమైనా ఈ రెండు వార్తలు ఈ ఏడాది అందరినీ అవక్కయ్యేలా చేసాయి.